తెలివైన ఆట | Ravi Teja Khiladi Shooting At Itali | Sakshi
Sakshi News home page

తెలివైన ఆట

Published Sat, Mar 20 2021 12:51 AM | Last Updated on Sat, Mar 20 2021 12:51 AM

Ravi Teja Khiladi Shooting At Itali - Sakshi

ఇక్కడున్న ఫొటో చూశారు కదా.. రవితేజ, డింపుల్‌ హయతి ఏదో చర్చించుకుంటున్నారు. ‘ఖిలాడి’ సినిమాకి సంబంధించిన లేటెస్ట్‌ ఫొటో ఇది. రవితేజ హీరోగా మీనాక్షీ చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ‘ప్లే స్మార్ట్‌’ అనేది ట్యాగ్‌లైన్‌ . రమేష్‌ వర్మ దర్శకత్వంలో డా. జయంతీలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌తో కలిసి పెన్‌  స్టూడియోస్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. సత్యనారాయణ కోనేరు నిర్మాత. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. ఈ షూట్‌కి సంబంధించి ఒక ఫొటోను విడుదల చేశారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘హై ఓల్టేజ్‌ యాక్షన్‌  ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ఇది. యాక్షన్‌  లవర్స్‌కు మంచి ట్రీట్‌ అవుతుంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మే 28న ‘ఖిలాడి’ని రిలీజ్‌ చేయనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మురళీకృష్ణ కొడాలి.
∙రవితేజ, డింపుల్‌ హయతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement