Love Hyderabad
-
Hyderabad: సంస్థల హెచ్చరికలు.. కానరాని ప్రేమ పక్షులు
సాక్షి, హైదరాబాద్: వలెంటైన్స్ డే.. ప్రేమ పక్షులకు ఇదో ప్రత్యేకమైన రోజు. ఎంతో ఆహ్లాదకరంగా జంటలు.. జంటలుగా వలెంటైన్స్ డేను జరుపుకొంటారు. పార్కులకు వెళ్లి ప్రేమ కబుర్లతో గడుపుతుంటారు. కానీ.. మంగళవారం నాటి వలెంటైన్స్ డే.. వెలవెలాబోయింది. పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే ఈ రోజున ప్రేమికులెవరూ బహిరంగంగా సంచరించవద్దని, పార్కుల్లో, ఇతర ప్రాంతాల్లో జంటలుగా కనిపించవద్దని.. ఒకవేళ కనిపిస్తే ‘పెళ్లి’ చేస్తామని కొన్ని సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో నగరంలోని పార్కుల్లో, లవ్ హైదరాబాద్ ఎదుట ప్రేమజంటల హడావుడి కనిపించలేదు. చదవండి: Makkah Masjid: ఎనిమిదేళ్లకు ‘గంట’ కొట్టింది! -
హైదరాబాద్‌తో ప్రేమలో పడకుండా ఉండగలమా... కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
తెలంగాణ ఐటీ, ఇండస్ట్రియల్ శాఖమంత్రి కేటీఆర్ తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. సాయంత్రం వేళ హుస్సేన్‌సాగర తీరంలో అస్తమిస్తున్న సూర్యుడు... అరుణ కాంతిని సంతరించుకుంటున్న ఆకాశం.. బిజీ లైఫ్‌లో దూసుకుపోతున్న హైదరాబాద్ ప్రజల జీవితాన్ని ఓ నెటిజన్ తన కెమెరాలో బంధించాడు. ఈ వీడియోకు ‘ఎవరైనా హైదరాబాద్‌తో ప్రేమలో పడకుండా ఎలా ఉండగలరు? అంటూ క్యాప్షన్ జోడించి మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్‌కి స్పందించిన మంత్రి కేటీఆర్ వెంటనే లవ్ ఎమోజీతో లవ్ హైదరాబాద్ అంటూ బదులిచ్చారు. కేటీఆర్ రిప్లైతో ఒక్కసారిగా ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. వందల కొద్ది రీట్వీట్లు, వేల కొద్ది కామెంట్లు వచ్చి పడుతున్నాయి. ❤️ Hyd https://t.co/W6b0vZCDqT — KTR (@KTRTRS) December 30, 2021 హైదరాబాద్ అన్నా ఇక్కడి కల్చర్ అన్నా మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేకమైన అభిమానం. ట్యాంక్‌బండ్‌పై సెల్ఫీ కోసం లవ్ హైదరాబాద్ హోర్డింగ్ పెట్టడం, ఆదివారం సాయంత్రం ట్యాంక్మీద సండ్ఫండే కార్యక్రమాలు రావడం వెనుక మంత్రి కేటీఆర్ ఎంతో చొరవ చూపించారు. ఇదే ట్విట్టర్ వేదికగా ఓ నెటిజన్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సుల అంశాన్ని గుర్తు చేయగా కేటీఆర్ వేగంగా స్పందించిన విషయం అందరికీ తెలిసింది. కేటీఆర్ స్పందనతో ఆర్టీసీ సైతం డబుల్ డెక్కర్ బస్సులు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. -
హైదరాబాద్‌కు "లవ్" లేదు..!
సాక్షి,సిటీబ్యూరో: ట్యాంక్‌బండ్‌పై సెల్ఫీ స్పాట్‌గా మారిన ‘లవ్ హైదరాబాద్’ ను శుక్రవారం తొలగించారు. స్ట్రీట్ ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు పాపారావు నేతృత్వంలో గత ఏడాది నవంబర్ 25న సాగర్ తీరంలో దీన్ని ఏర్పాటు చేశారు. అయితే, కొందరు సందర్శకులు సెల్ఫీలతో సరిపెట్టుకోకుండా ఐకాన్‌పై తమ పేర్లు, పిచ్చి రాతలు రాస్తుండడంతో కళ కోల్పోయింది. మరోవైపు సింబల్ ముందు సెల్ఫీలతో ట్రాఫిక్ సమస్య సైతం నెలకొంటోంది. ఈ నెలాఖరులో జరిగే గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఈ ఐకాన్‌ను తొలగించినట్లు సమాచారం. త్వరలో ‘లవ్ హైదరాబాద్’ నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేయనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. -
సెల్ఫీ స్పాట్.. ట్యాంక్‌బండ్..!
► ఇక్కడికి వచ్చే వారు ఒకటో రెండో సెల్ఫీలు తీసుకోకుండా వెళ్లరు ► ‘లవ్ హైదరాబాద్’ టైపో స్కల్ప్చర్ ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ‘లవ్ హైదరాబాద్ టైపో స్కల్ప్చర్(లవ్ హైదరాబాద్ అక్షరా లతో కూడిన శిల్పం)’తో నగరంలోని ట్యాంక్‌బండ్ సెల్ఫీ స్పాట్‌గా మారనుం దని.. ఇక్కడికొచ్చే ప్రతి ఒక్కరూ ఒకటో, రెండో సెల్ఫీలు తీసుకోకుండా వెళ్లరని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. ‘స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్’ ముగింపును పురస్కరించుకుని ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’, ‘కృష్ణకృతి ఫౌండేషన్’ సంస్థలు జీహెచ్ఎంసీ సహకారంతో ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన ‘లవ్ హైదరాబాద్’ టైపో స్కల్ప్చర్ను శుక్రవారం సాయంత్రం మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లవ్ హైదరాబాద్ టైపో స్కల్ప్చర్ నగరానికి అదనపు ఆకర్షణ కానుందన్నారు. హైదరాబాద్ ప్రజలకు ఆహ్లాదం, ఉల్లాసం కలిగించేలా, పర్యాటక ప్రాంతంగా ట్యాంక్‌బండ్‌ను మరింత సుందరంగా తీర్కిదిద్దాల్సిన బాధ్యత తమపై ఉంద న్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పర్యాటక శాఖల సమన్వయంతో సాధ్యమైనంత త్వరగా ట్యాంక్‌బండ్‌ను, హైదరాబాద్‌ను అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. స్ట్రీట్ ఆర్ట్ ఫెస్టివల్లో భాగంగా ముంబై, ఢిల్లీ తరహాలో నెక్లెస్‌రోడ్‌లో పీపుల్స్ ప్లాజా ఎదుట ఎంఎస్ మక్తాలోని భవనాలు, గోడలకు స్థానిక కళాకారులతోపాటు జాతీయ, అంతర్జాతీయ కళాకారులు సృజనాత్మకం గా వేసిన చిత్రాలను మంత్రి సందర్శించా రు. మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. నాలుగు వందల ఏళ్లకు పైబడిన ఘన చరిత్ర కలిగిన హైదరా బాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థారుులో మరింతగా అభివృద్ధి పరిచేందుకు ప్రయత్నిస్తున్నామని, తద్వారా పర్యాట కంగానూ నగరం మరింత అభివృద్ధి చెందగలదని అన్నారు. ప్రభుత్వ సలహా దారు బీవీ పాపారావు మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజల్లో కళాత్మకత, సౌందర్య దృష్టి పెరుగుతాయ న్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు, టూరిజం సెక్రటరీ బి.వెంకటేశం, ట్రాఫిక్ ఏసీపీ జితేందర్ తదితరులు పాల్గొన్నారు.