Telangana IT Minister KTR Tweeted 'Love Hyderabad': హైదరాబాద్‌తో ప్రేమలో పడకుండా ఉండగలమా - Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌తో ప్రేమలో పడకుండా ఉండగలమా... కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌

Published Fri, Dec 31 2021 8:31 AM | Last Updated on Fri, Dec 31 2021 11:40 AM

Telangana IT Minister KTR Tweeted Love Hyderabad - Sakshi

తెలంగాణ ఐటీ, ఇండస్ట్రియల్‌ శాఖమంత్రి కేటీఆర్‌ తాజాగా చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. సాయంత్రం వేళ హుస్సేన్‌సాగర తీరంలో అస్తమిస్తున్న సూర్యుడు... అరుణ కాంతిని సంతరించుకుంటున్న ఆకాశం.. బిజీ లైఫ్‌లో దూసుకుపోతున్న హైదరాబాద్‌ ప్రజల జీవితాన్ని ఓ నెటిజన్‌ తన కెమెరాలో బంధించాడు. ఈ వీడియోకు ‘ఎవరైనా హైదరాబాద్‌తో ప్రేమలో పడకుండా ఎలా ఉండగలరు? అంటూ క్యాప్షన్‌ జోడించి మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్‌ చేశారు. ఈ ట్వీట్‌కి స్పందించిన మంత్రి కేటీఆర్‌ వెంటనే లవ్‌ ఎమోజీతో లవ్‌ హైదరాబాద్‌ అంటూ బదులిచ్చారు. కేటీఆర్‌ రిప్లైతో ఒక్కసారిగా ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. వందల కొద్ది రీట్వీట్లు, వేల కొద్ది కామెంట్లు వచ్చి పడుతున్నాయి.

హైదరాబాద్‌ అన్నా ఇక్కడి కల్చర్‌ అన్నా మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేకమైన అభిమానం. ట్యాంక్‌బండ్‌పై సెల్ఫీ కోసం లవ్‌ హైదరాబాద్‌ హోర్డింగ్‌ పెట్టడం, ఆదివారం సాయంత్రం ట్యాంక్‌మీద సండ్‌ఫండే కార్యక్రమాలు రావడం వెనుక మంత్రి కేటీఆర్‌ ఎంతో చొరవ చూపించారు. ఇదే ట్విట్టర్‌ వేదికగా ఓ నెటిజన్‌ నగరంలో డబుల్‌ డెక్కర్‌ బస్సుల అంశాన్ని గుర్తు చేయగా కేటీఆర్‌ వేగంగా స్పందించిన విషయం అందరికీ తెలిసింది. కేటీఆర్‌ స్పందనతో ఆర్టీసీ సైతం డబుల్‌ డెక్కర్‌ బస్సులు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement