సాక్షి,సిటీబ్యూరో: ట్యాంక్‌బండ్‌పై సెల్ఫీ స్పాట్‌గా మారిన ‘లవ్ హైదరాబాద్’ ను శుక్రవారం తొలగించారు. స్ట్రీట్ ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు పాపారావు నేతృత్వంలో గత ఏడాది నవంబర్ 25న సాగర్ తీరంలో దీన్ని ఏర్పాటు చేశారు. అయితే, కొందరు సందర్శకులు సెల్ఫీలతో సరిపెట్టుకోకుండా ఐకాన్‌పై తమ పేర్లు, పిచ్చి రాతలు రాస్తుండడంతో కళ కోల్పోయింది.
మరోవైపు సింబల్ ముందు సెల్ఫీలతో ట్రాఫిక్ సమస్య సైతం నెలకొంటోంది. ఈ నెలాఖరులో జరిగే గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఈ ఐకాన్‌ను తొలగించినట్లు సమాచారం. త్వరలో ‘లవ్ హైదరాబాద్’ నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేయనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment