టాయ్ గన్‌తో సెల్పీ...తుపాకీ గుళ్లకి బలి
ఇస్లామాబాద్: టీనేజర్ ఫర్హన్ తన వద్దనున్న టాయి్ గన్‌తో సెల్ ఫోన్లో సెల్ఫీ తీసుకోవడమే అతడి జీవితానికి అఖరి క్షణాలయ్యాయి. ఫర్హన్ వద్దనున్న టాయ్గన్ నిజమైనదని... అతడు దొంగ అని భావించిన ఓ పోలీసు.. ఫర్హన్పై కాల్పులు జరిపాడు. దాంతో పోలీసు ఎటువంటి హెచ్చరికలు చేయకుండానే ఫర్హన్పై కాల్పులు జరిపాడు.దాంతో ఫర్హన్ కుప్పకూలిపోయి.. మరణించాడు. అక్కడే ఉన్న అతడి స్నేహితుడు ప్రాణాలు దక్కించుకున్నారు.
ఆ తర్వాత ఘటన స్థలానికి వచ్చిన కాల్పులు జరిపిన పోలీసు... ఫర్హన్ వద్ద ఉన్నది టాయి గన్ అని నిర్థారించుకున్న సదరు పోలీసు తప్పు చేశానని తెలుసుకున్నాడు. అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. కాల్పులు జరిపిన పోలీసును పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సోమవారం పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని ఫైసలాబాద్ నగరంలో చోటు చేసుకుందని మీడియా మంగళవారం ఓ కథనాన్ని ప్రసారం చేసింది.