సెలబ్రిటీలతో సెల్ఫీలు దిగడం ఆపేయాలని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తమ సంస్థ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: సెలబ్రిటీలతో సెల్ఫీలు దిగడం ఆపేయాలని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తమ సంస్థ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆధార్ కార్డుకు సంబంధించి ఎంఎస్ ధోనీ వచ్చినప్పుడు సంస్థలో సెల్ఫీల గందరగోళం నెలకొని పనులకు అంతరాయం ఏర్పడింది. కొంతమంది ఉద్యోగుల మధ్యలో మనస్ఫర్థలు కూడా ఏర్పడ్డాయట. ఈ నేపథ్యంలో ఇలాంటివి మున్ముందు జరగకుండా ఉండేందుకు ఇకపై సెలబ్రిటీలు వస్తే వారితో ఫొటోలు దిగడం, సెల్ఫీలు తీసుకోవడం ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది.
వ్యక్తిగత ప్రాముఖ్యతలను విధుల నిర్వర్తించే సమయంలో పక్కన పెట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ‘ఆధార్ కార్డు నమోదు చేసే సమయంలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని మేం మా ఉద్యోగులకు ఆదేశించాం. సెలబ్రిటీల ఆధార్ నమోదు చేసే సమయంలో ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత ప్రాముఖ్యతకు చోటివ్వొద్దు. సెల్ఫీల్లాంటివి తీసుకోవడం చేయొద్దు’ అని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే స్పష్టం చేశారు.