
సహజ సౌందర్యానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకయైన పండుగ బతుకమ్మ. తంగేడు, గునుగు, కట్ల, గుమ్మడి, రుద్రాక్ష వంటి తీరొక్కపూలను ఒక్కచోట చేర్చి గౌరమ్మను కొలిచే వేడుక. ఏడాదికి ఒకసారైనా ఊరు ఊరంతా ఒక్కచోట చేరి సంబరంగా జరుపుకునే ఉత్సవం. తెలంగాణ విలక్షణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ఈ పూల జాతరలో సందడంతా ఆడపడుచులదే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది కేవలం పూల పండుగే కాదు, ఆడపిల్లల ఆటవిడుపు పండుగ కూడా. ఏడాదంతా అత్తవారింట్లో గడిపిన, ఆడపడుచులను తప్పనిసరిగా పుట్టింటికి తీసుకువచ్చే ఈ పండుగ నాడు ఆటపాటలు, కోలాటాలతో గౌరీదేవిని కొలిచే మన ఇంటి మహాలక్ష్ములను చూసేందుకు రెండుకళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు.
చిన్నా, పెద్దా ప్రతిఒక్కరికి సంతోషాన్ని పంచే బతుకమ్మ వేడుకలు, శరన్నవరాత్రులు ప్రారంభమైన నేపథ్యంలో.. మీ పండుగ ఫొటోలు, మధుర జ్ఞాపకాలను ప్రపంచంతో పంచుకునే అవకాశాన్ని ‘సాక్షి’మీకు కల్పిస్తోంది. సెల్ఫీ విత్ సాక్షి పేరిట sakshi.com నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలంటే 9010533389 వాట్సాప్ నంబర్‌కు బతుకమ్మతో ఉన్న మీ సెల్ఫీలు పంపండి. పండుగ సంబరాన్ని మాతో షేర్ చేసుకోండి. మీరు పేరు, ఏరియా పేరు రాయడం మర్చిపోకండి.
Comments
Please login to add a commentAdd a comment