
సెల్ఫీ సరదాతో కూలిన విమానం
డెనివర్(అమెరికా): సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలానే విన్నాం. కానీ సెల్ఫీ తీసుకోవాలనే సరదా ఒక విమానం కూలడానికి కారణం అయ్యింది. గతేడాది జరిగిన విమాన ప్రమాదానికి సెల్ఫీ సరదానే కారణమని ఆలస్యంగా వెలుగు చూసింది. డెనివర్ సమీపంలో సంవత్సరం కింద ఒక చిన్న కొలరాడో విమానం కూలి పైలట్తో సహా మరో వ్యక్తి మరణించాడు. విమానం కూలడానికి గల కారణాలని అన్వేషించిన ఫెడరల్ ఆసిడెంట్ ఇన్వెస్టిగేటర్స్ ఒక నివేదికని అందజేసింది. పైలెట్ సెల్ఫీ తీయడానికి ప్రయత్నిస్తూ పరధ్యానంతో విమానం నడిపిన కారణంగానే అదుపుతప్పి కూలిందని అధికారులు తేల్చారు.