
సాక్షి, ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోలవరం కుడికాలువ వద్ద నిన్న(బుధవారం) సెల్ఫీలు దిగుతూ ప్రమాదవశాత్తూ కాలువలో పడి గల్లంతైన మున్నా, కార్తీక్ అనే విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పోలవరం కుడి కాలువ లాకుల వద్ద మృతదేహాలు కనిపించినట్లు సమాచారం. మృతదేహాలను వెలికి తీసిన అనంతరం పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల మృతదేహాల వద్ద తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment