సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలంగాణ సీఈఓ రజత్‌కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఓటేశాక సెల్పీ తీసుకోకూడదన్నారు. అలా చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పోలింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. నిజామాబాద్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. తెలంగాణలో 2 కోట్ల 97 లక్షల 8599 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు సామాగ్రి పంపిస్తున్నాం. అభ్యర్థులు 48 గంటల ముందు ప్రచారం బంద్ చేయాలి. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరనుంది.
అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. 4,169 పోలింగ్ కేంద్రాలకు లైవ్ వెబ్ క్యాస్టింగ్ చేస్తున్నాం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించాం. 90 శాతం ఓటరు స్లిప్‌లు పంపిణీ చేశాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై నిఘా పెట్టి చర్యలు తీసుకుంటున్నాం. పెయిడ్ న్యూస్ కింద 579 కేసులు నమోదు చేశాం. రాష్ట్రంలో 52 కోట్ల 62 లక్షల రూపాయలు సీజ్ చేశాం. సీ విజిల్ యాప్‌కు మంచి స్పందన వస్తుంది. ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు పోలింగ్ రోజు సెలవు ఇవ్వాలి లేదంటే తీసుకుంటామ’ని రజత్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment