
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ పత్రంలోని ప్రతీ కాలమ్ ఫీల్ చెయ్యాలని, లేదంటే నామినేషన్ తిరస్కరణ అవుతుందని రాష్ట్రం ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ అన్నారు. ఫామ్ 26( విదేశీ ఆస్తులపై) కూడా డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. సోమవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ రోజు నుంచి ( మర్చి 18) అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల కేంద్రాల్లో నామినేషన్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. నామినేషన్ల కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. కోడ్ ఉల్లంఘనపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. పార్టీ ప్రచార సభల్లో ప్లెక్సీలు, బ్యానర్లు పెట్టరాదని, ఒకవేళ బ్యానర్లు ఏర్పాటు చేయాలనుకుంటే ఎన్నికల అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. స్కూల్ విద్యార్థులను ప్రచారానికి వాడుకోవద్దన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం మూడు రోజుల పాటు సెలవులు ఉన్నాయని, ఆ రోజుల్లో ( 21న హోలీ, 23న నాల్గొ శనివారం, 24 ఆదివారం) నామినేషన్లు స్వీకరించబోమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment