ప్రభాస్‌ సీక్రెట్‌ క్రష్‌.. ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌! | Prabhas Mad fan of Raveena Tandon | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 8 2017 2:47 PM | Last Updated on Sun, Jul 14 2019 1:22 PM

Prabhas Mad fan of Raveena Tandon  - Sakshi

సాక్షి, సినిమా : యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు బాహుబలి సిరీస్‌ ఇచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ చిత్రం మూలంగా డార్లింగ్‌ తన సిగ్గును పక్కనపెట్టేసి బాలీవుడ్‌కు వెళ్లి మరీ చిత్రాన్ని ప్రమోట్‌ చేయాల్సి వచ్చింది. ఏది ఏమైనా ప్రభాస్‌ ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న హీరో. మరి అలాంటి హీరోకి ఓ సీక్రెట్‌ క్రష్‌ కూడా ఉందంట. 

అది ఎవరి మీదో కాదు.. బాలీవుడ్‌ సీనియర్‌ నటి రవీనా టండన్‌. అఫ్‌ కోర్స్‌ ఈ విషయాన్ని ప్రభాస్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడనుకోండి. రవీనాకు తాను వీరాభిమానినని.. అందాజ్‌ అప్నా అప్నా చిత్రంలోని ‘ఎలో జీ సనమ్‌’ పాట ప్రతీ క్షణం తనని వెంటాడుతుందని ప్రభాస్‌ చెప్పాడు. ఆమెతో నటించే అవకాశం వస్తే అస్సలు వదలిపెట్టనన్నాడు. అయితే అనుకోకుండా బాహుబలి సిరీస్‌ను ఆమె భర్త అనిల్‌ టండానీ బాలీవుడ్‌లో డిస్ట్రిబ్యూట్‌ చేశాడు. ఇంకేం బాహుబలి ప్రమోషన్‌ కోసం ముంబై వెళ్లిన ప్రతీసారి ప్రభాస్‌ రవీనా టండన్‌ దంపతులను కలిసేవాడు. 

ఆ తర్వాత కూడా వీలుచిక్కినప్పుడల్లా అక్కడికి వెళ్తున్న ప్రభాస్‌ అదే పని చేస్తూ వస్తున్నాడు. అంతెందుకు ఈ మధ్య కూడా ఓసారి డిన్నర్‌ కోసం ప్రభాస్‌ వాళ్లింటికి వెళ్లి.. రవీనాతో సెల్ఫీలు దిగి సంబరపడిపోయాడు. ఏది ఏమైనా కోట్ల సంఖ్యలో అభిమానులను తయారు చేసుకున్న ప్రభాస్‌.. ఓ అభిమానిగా తన ముచ్చట తీర్చుకోవటం మాత్రం ఆసక్తికరంగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్‌ సుజిత్‌ దర్శకత్వంలో సాహోలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, మళయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement