
కెమెరా ఫోన్లు అందులోనూ.. సెల్ఫీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాక.. ఈ పిచ్చి ప్రపంచమంతా బాగా ముదిరింది. ప్రమాదాల అంచుల్లోనూ, హరికేన్ల విలయతాండవం దగ్గరా.. యాక్సిడెంట్ అయిన చోటా.. ఇలా ఒకటేమిటి ప్రతిచోటా సెల్ఫీలే. ఈ పిచ్చి నేడు మరింత పీక్ స్టేజ్‌కు చేరుకుంది. అత్యంత ప్రమాకర ప్రాంతాల్లో సైతం సెల్ఫీ తీసుకుని దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనేంతగా యువతను పరుగులు తీయిస్తోంది. ఈ ప్రాంతంలో సెల్ఫీలు తీసుకునే క్రమంలో పదుల సంఖ్యలో ప్రాణాలు పోగొట్టుకున్నారని అధికారులు చెబుతున్నా.. యువత ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సెల్ఫీ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తామంటోది నేటి యువత.




