అలాంటి సెల్ఫీలను పోస్ట్ చేయవద్దు! | do not post photoshoped items on social media, says Evelyn Sharma | Sakshi
Sakshi News home page

అలాంటి సెల్ఫీలను పోస్ట్ చేయవద్దు!

Published Sun, Jul 10 2016 2:27 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

అలాంటి సెల్ఫీలను పోస్ట్ చేయవద్దు! - Sakshi

అలాంటి సెల్ఫీలను పోస్ట్ చేయవద్దు!

ముంబై: ఫొటో షాప్ చేసిన సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దంటూ బాలీవుడ్ నటి ఈవ్లెన్ శర్మ కోరుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే... మనం ఎలా ఉన్నామో.. చక్కగా అలాగే సెల్ఫీలు, ఫొటోలు దిగి ఆన్ లైన్ మాధ్యమాలలో అప్ లోడ్ చేస్తే బాగుంటుందని ఇండో-జర్మన్ నటి పేర్కొంది. సహజ సౌందర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అయితే ఫొటోషాప్ చేసిన సెల్ఫీలు, ఫొటోలతో అసలు లుక్ బయటపడదని చెప్పింది.

తమని తాము ప్రతి ఒక్కరూ ప్రేమించుకోవాలని, అందులో భాగంగా మంచి సెల్ఫీలు దిగాలంటూ పిలుపునిచ్చింది. ఇప్పటికైనా మేల్కొనండీ.. సహజ అందాలను గుర్తించండీ అని చెబుతోంది. నిజానికి ఈవ్లెన్ శర్మకు సెల్ఫీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే అలవాటు ఉంది. సెలబ్రిటీలు సెల్ఫీలు తీసుకున్నాక ఫొటోషాప్ చేసి వాటికి హంగులు అద్దిన తర్వాత అప్ లోడ్ చేస్తున్నారని, అందులో సహజత్వం ఉండదని అభిప్రాయపడింది. ఆమె నటించిన 'భయ్యాజీ సూపర్ హిట్' త్వరలో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement