ప్రియాంక ఆ విషయాన్ని రివీల్ చేసేసింది!
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రాను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి.. కానీ ఒక్కరూ మాత్రం ఆమెను ఇష్టపడలేదట. ఈ విషయాన్ని ప్రియాంక చోప్రానే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ప్రియాంకను ఇష్టపడని వారెవరో తెలుసా? ఓ సీనియర్ సిటిజన్ అట. ఓసారి చాలా బ్యాంగులు మోస్తూ కనిపించిన ఓ సీనియర్ సిటిజన్ను చూసి చలించిపోయిన ప్రియాంక, ఆమెకు సహాయం చేయాలని భావించింది. వెళ్లి వెంటనే తాను సహాయం చేయదలిచినట్టు చెప్పగానే, ఆ మహిళ ప్రియాంకపై మండిపడిందట. ఏమిటి? నాకోసం నేను ఈ సామాన్లు మోయలేనని అనుకుంటున్నావా? అని ప్రియాంక ఆఫర్ను తిరస్కరించిందట.
ఆ మహిళ అచ్చం తనకు ప్రతిబింబంలా అనిపించిందని, సహాయం అడిగినందుకు మనస్తాపం చెంది, వెంటనే క్షమాపణ చెప్పి వచ్చినట్టు ప్రియాంక ఇంటర్వ్యూలో పేర్కొంది. ప్రస్తుతం ప్రియాంక తన పాపులర్ టెలివిజన్ సిరీస్ క్వాంటికోగా రెండో సీజన్లో బిజీగా ఉంది. యాక్షన్ చిత్రాలపై ప్రియాంక ఎక్కువగా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. క్వాంటికోగాలో ప్రియాంక సీఐఏ ఏజెంట్గా నటిస్తోంది. ఇప్పటికే తాను చాలా యాక్షన్ సినిమాలు చేశానని, వాటిలో అనుభవం కలిగి ఉన్నాయని, తాను చాలా జాగ్రత్తగా ఉంటానని ప్రియాంక పేర్కొంది. ప్రియాంక టాప్ యాక్షన్ మూవీలు డాన్ సిరీస్, జైన్ గంగాజల్.