State Bank Of India Launches New Whatsapp Service For Senior Citizens - Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌

Nov 19 2022 8:01 PM | Updated on Nov 19 2022 8:27 PM

State Bank Of India Launches New Whatsapp Service For Senior Citizens - Sakshi

సీనియర్‌ సిటిజన్లకు ఎస్‌బీఐ శుభవార్త చెప్పింది. ఇకపై లబ్ధిదారులు బ్యాంకును సందర్శించే అవసరం లేకుండా కొత్త సర్వీసుల్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా పెన్షన్‌ స్లిప్‌ను లబ్ధి దారుల వాట్సాప్‌కు పంపే సర్వీసును ప్రారంభించినట్లు తెలిపింది. 

మొబైల్‌ నంబరు నుంచి 9022690226కి ‘హాయ్‌’ అని వాట్సాప్‌ మెసేజ్‌ పంపాలి. అలా పంపిన యూజర్లకు పెన్షన్‌ స్లిప్‌ తో పాటు అకౌంట‍్లకు సంబంధించిన మినిస్టేట్మెంట్‌,బ్యాలెన్స్‌ ఎంక్వైరీ సమాచారం పొందవచ్చు. 

ఇందుకోసం వినియోగదారులు వారి బ్యాంక్‌ అకౌంట్‌కు జత చేసిన ఫోన్‌ నెంబర్‌ను రిజిస్టర్‌ చేసుకోవాలి.ఆ మొబైల్‌ నంబర్‌ నుంచి WAREG అని టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి మీ అకౌంటర్‌ నంబర్‌ను టైప్‌ చేసి 72089 33148 నంబర్‌కు మెసేజ్‌ చేస్తే సరిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement