
సీనియర్ సిటిజన్లకు ఎస్‌బీఐ బంపరాఫర్
సీనియర్ సిటిజన్లకు ఎస్‌బీఐ బంపరాఫర్ ఇచ్చింది. ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీం ఎస్‌బీఐ వీకేర్ గడువును మార్చి 31,2023 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఈ స్కీమ్ పథకంలో చేసిన డిపాజిట్లకు అదనపు వడ్డీ లభిస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్ ఎఫ్‌డి స్కీమ్ ఎస్‌బీఐ వీకేర్ ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టే గడువును మార్చి 31, 2023 వరకు పొడిగించింది. ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం..సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రత్యేక “ఎస్‌బీఐ వీకేర్” డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టబడింది.
ఈ స్కీమ్‌లో అర్హత పొందిన సీనియర్ సిటిజన్‌లు 30 బేసిస్ పాయింట్లు అదనంగా పొందవచ్చు. అంటే సాధారణ ప్రజలకంటే 50 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ ఎస్‌బీఐ సీనియర్ సిటిజన్‌లకు లభిస్తుంది. సిటిజన్లకు సాధారణ ప్రజలకు వర్తించే రేటు కంటే 80 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ ఈ పథకం ద్వారా లభిస్తుంది. ప్రస్తుతం ఎస్‌బీఐ సాధారణ ప్రజలకు 5ఏళ్ల ఎఫ్‌డీకి 5.65శాతం వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుండగా...సీనియర్ సిటిజన్ ప్రత్యేక ఎఫ్‌డీ పథకంలో చేసిన డిపాజిట్లకు 6.45శాతం వడ్డీ లభిస్తుంది.
డిపాజిట్ వ్యవధి : కనిష్టంగా - 5 సంవత్సరాలు. గరిష్టంగా - 10 సంవత్సరాలు
వడ్డీ చెల్లింపు : టర్మ్ డిపాజిట్ - నెలవారీ/ త్రైమాసిక వ్యవధిలో ప్రత్యేక టర్మ్
డిపాజిట్ : మెచ్యూరిటీ వడ్డీపై టీడీఎస్ డిడక్ట్ చేసి కస్టమర్ ఖాతాకు జమ చేయబడుతుంది
రుణ సౌకర్యం
సీనియర్ సిటిజన్లకు పలు బ్యాంకులు ప్రత్యేక ఎఫ్‌డి పథకాల్ని ఇతర బ్యాంకులు సైతం అందిస్తున్నాయి. వీటిలో ఐసిఐసిఐ బ్యాంక్ , హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులతో పాటు ఇతర బ్యాంకులున్నాయి.