కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య
నేను ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాను. జీతం రూ. 8 లక్షలు. పాన్ ఉంది. రిటర్న్ వేయటం లేదు. ప్రతి సంవత్సరం మా యజమాని కొంత మొత్తం ఇన్‌కం ట్యాక్స్ నిమిత్తం కట్ చేస్తారు. వివరాలు ఇవ్వడం లేదు – ఎస్ రామచంద్ర నాయుడు, మెదక్
మీ తరఫు నుంచి ఆలోచిస్తే, మీరు స్వయంగా ఆదాయపు పన్ను చట్టప్రకారం ట్యాక్సబుల్ ఇన్‌కం ఉంది కాబట్టి ప్రతి సంవత్సరం రిటర్ను దాఖలు చేయాలి. మార్చి 21తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్ను దాఖలు చేయండి. ఆన్‌లైన్‌లో వేయవచ్చు. ఇక రిటర్ను వేయడానికి మీ జీతం వివరాలు, ఇతర ఆదాయపు వివరాలు, బ్యాంకు అకౌంటు వివరాలు, బ్యాంకులో జమ అయిన వడ్డీ, రెడీగా ఉండాలి. దీనితో పాటు మీ యజమాని మీకు ఫారం 16 ఇవ్వాలి. అడగండి. ఫారం 16లో అన్ని వివరాలు ఇవ్వాలి. పన్ను భారాన్ని మీ యజమాని మీ దగ్గర్నుండి ’కట్’ చేశారు కాబట్టి ఆ వివరాలు వారి దగ్గర ఉంటాయి. దీన్నే టీడీఎస్ అంటారు.
అలా కట్ చేసిన మొత్తాన్ని మీ యజమాని సకాలంలో ప్రభుత్వానికి చెల్లించాలి,. ఆ తర్వాత ఆ వివరాలను అప్‌లోడ్ చేయించాలి. మొత్తం సమాచారం ఫారం ’26 అ ’లో కనిపిస్తుంది. ఇలా కనిపించిందంటే మీరేం గాభరా పడనక్కర్లేదు. ఆ వివరాలతో మీరు దాఖలు చేసుకోవచ్చు. అలా కాకుండా, మీ దగ్గర్నుంచి ’కట్’ చేసి, ఆ మొత్తాన్ని మీ తరఫున ప్రభుత్వానికి చెల్లించకపోవటం చట్టరీత్యా నేరం. చట్టరీత్యా శిక్ష పడుతుంది. కాబట్టి పూర్తిగా చెక్ చేసుకోండి. అన్నీ సవ్యంగా ఉంటే సరి. లేదంటే మీ ఉద్యోగస్తులందరూ కలిసి యజమానిని అడగండి. సమస్య సమసిపోతుంది. లేదంటే తగిన సాక్ష్యాధారాలతో ఆదాయపు పన్ను అధికారులకు తెలియజేయండి.
సీనియర్ సిటిజన్‌లకు సంబంధించి ఆదాయపు పన్ను చట్టంలోని అంశాలు తెలియజేయగలరు – కేఆర్ రెడ్డి, ఏలూరు
సీనియర్ సిటిజన్‌లకు ఆదాయపు పన్ను చట్టం ప్రకారం కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి కేవలం రెసిడెంట్‌లకు మాత్రమే వర్తిస్తాయి. నాన్ రెసిడెంట్‌లకు వర్తించవు. 60 సం.లు దాటి, 80 సం.ల లోపు ఉన్న వారిని సీనియర్ సిటిజన్‌లు అంటారు. 80 సం.లు దాటిన వారిని వెరీ సీనియర్ సిటిజన్‌లు అంటారు. 31–3–2021 నాటికి ఈ రూలు వర్తింపచేస్తారు. చాలా మంది రిటర్నులు దాఖలు చేసిన తేదీకి వర్తిస్తుంది అని అనుకుంటారు. 60 సం. లోపు వారికి బేసిక్ లిమిట్ రూ.2,50,000, 60–80 సం.ల వారికి ఇది రూ. 3,00,000 కాగా, 80 సం.లు దాటిన వారికి బేసిక్ లిమిట్ రూ. 5,00,000గా ఉంది. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులో మినహాయింపు ఉంది.
సీనియర్ సిటిజన్‌లకు వ్యాపారం/వృత్తి నుంచి ఆదాయం లేకపోతే వారు ముందుగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. వ్యాపారం/వృత్తి నుంచి ఆదాయం వచ్చే వారికి ఈ మినహాయింపు లేదు. 80 ఖీఖీఆ ప్రకారం రూ. 50,000 వరకు నిర్దేశిత వడ్డీ మీద మినహాయింపు ఉంది. టీడీఎస్ మినహాయింపు ఉంది. ప్రతి బ్యాంకు నుంచి వచ్చే వడ్డీ (మొత్తం వడ్డీ కాదు) రూ. 50,000 దాటకపోతే టీడీఎస్ ఉండదు. 80 ఈఈఆ ప్రకారం వైద్య చికిత్స నిమిత్తం మినహాయింపులు ఉన్నాయి. అలాగే 80 ఈ ప్రకారం ఇన్సూరెన్స్ క్లెయిమ్, వైద్య చికిత్స కోసం మినహాయింపులు ఉన్నాయి. 75 ఏళ్లు దాటిన వారు రిటర్నులు వేయనవసరం లేదు.
- కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిఫుణులు
Comments
Please login to add a commentAdd a comment