
విశ్రాంత ఉద్యోగికి నోటీసు ఇస్తున్న పోలీసులు
సాక్షి, పాకాల : ఎన్నికల హడావుడి మొదలుకావడంతో పోలీసులు వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా గొడవలతో సంబంధం లేని విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులకు నోటీసులు ఇస్తున్నారు. పోలీసు స్టేషన్‌కు రావాలని చెబుతుండడంతో వృద్ధులు ఆందోళన చెందుతున్నారు. శాంతికి భంగం కలిగించకుండా ఉండాలని, ముందస్తుగా రూ.2 లక్షలకు ప్రామిసరీ నోటు రాసివ్వాలని పోలీసులు చెబుతున్నారని, ఇలా ఎప్పుడూ లేదని వారు పేర్కొంటున్నారు. ఈ విషయంపై ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ని వివరణ కోరగా శాంతిభద్రతల దృష్ట్యా అన్ని పార్టీల వారికి నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment