
గవర్నర్... మీకు ఇంత సెక్యూరిటీ అవసరమా?
‘నీకు ఇంత సెక్యూరిటీ అవసరమా? ఇన్ని వాహనాలు, ప్రజాధనం వృథా చేయడమేమిటి సార్?’.. అంటూ ఓ సీనియర్ సిటిజన్ గవర్నర్ నరసింహన్‌ను నిలదీశారు. శనివారం సెంట్రల్ యూనివర్సిటీలో డీఎన్‌ఏ-13 సదస్సుకు వచ్చిన విజయ్ అనే సీనియర్ సిటిజన్ గవర్నర్‌పై ప్రశ్నల వర్షం కురిపించాడు. ‘‘నిజాం రాజులు ఓపెన్‌టాప్ జీపులో ఒంటరిగా వెళ్లేవారు.. నీకు ఇంత సెక్యూరిటీ అవసరమా? ఇన్ని వాహనాలు, ప్రజాధనాన్ని వృథా చేయడమేంటి సార్?’’ అని నిలదీశారు.
దీంతో అక్కడ ఉన్న శాస్త్రవేత్తలు, డీజీపీతో పాటు సదస్సుకు వచ్చిన డెలిగేట్లు అవాక్కయ్యారు. తనకు నాలుగు రక్షణ వాహనాలే ఉన్నాయని, మిగతావన్నీ మీడియా వాహనాలేనని గవర్నర్ సమాధానమిచ్చారు. ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులంటూ శాస్త్రవేత్త సారస్వత్ కల్పించుకున్నారు. దాంతో విజయ్.. ‘‘మా డబ్బులు ఊరికే ఉన్నాయా?’’ అని అంటుండగానే అక్కడికి వచ్చిన పోలీసులు దూరంగా తీసుకువెళ్లారు.