అంబటి రాయుడి రౌడీయిజం
హైదరాబాద్: భారత క్రికెటర్ అంబటి రాయుడు హబ్సిగూడలో హల్ చల్ చేశారు. ర్యాష్ డ్రైవింగ్‌ను ప్రశ్నించిన ఓ సినీయర్ సిటీజన్‌పై ఏకంగా చేయిచేసుకొన్నారు. దీన్ని ఫోన్‌లో చిత్రికరించిన ఓ సిటీజన్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడిది వైరల్ అయింది.
సికింద్రాబాద్ హబ్సిగూడలోని జెన్‌పాక్ట్ కాలనీలో ఉంటున్న రాయుడు గురువారం ఉదయం కారులో వేగంగా వెళ్తున్నారు. అదే సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ సీనియర్ సిటీజన్‌ను తాకుతూ అతని కారు వెళ్లింది. దీంతో ఆ వ్యక్తి నెమ్మదిగా వెళ్లాలని అరిచాడు. దీనికి కోపం తెచ్చుకున్న రాయుడు కారు దిగి ఆయన్ను దుర్భాషలాడటంతోపాటు చేయి చేసుకున్నారు. అతని తీరు చూసిన స్థానికులు నివ్వెరపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సీనియర్ సిటిజన్స్ ఫోరం ప్రతినిధులు తెలిపారు.
ఇక రాయుడు భారత్ తరుపున 34 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు, 6 టీ20 మ్యాచ్‌లు ఆడారు. ఇక ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టు తరుపున ఆడుతూ గర్తింపు పొందారు.
.