
హైదరాబాద్: సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనపై టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు సైతం స్పందించాడు. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ట్వీటర్ అకౌంట్‌లో ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన జరగడం చాలా దారుణమని, ఇది మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
అంబటి రాయుడు కూడా ఈ పాశవిక ఘటనపై తీవ్రంగా మండిపడ్డాడు. దీనికి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని, అత్యాచార నిందితుల్ని ఉరి తీయాల్సిందేనని ట్వీటర్‌లో పేర్కొన్నాడు. ‘ ఎవరైనా మహిళ శరీరాన్ని దోచుకోవాలని ఆలోచించే వారికి ఇదొక కనువిప్పు కావాలి. వారి మెడలను గట్టిగా బిగించి ఉరి తీయండి. ఇందుకు ఎక్కువ ఆలోచన అవసరం లేదు. ఉరే సరైనది’ అని అంబటి రాయుడు ట్వీట్ చేశాడు.
Anyone who thinks of violating a woman's body should imagine the noose tightening around their neck.lets not think too much.its high time that we act. Hang the rapists..
— Ambati Rayudu (@RayuduAmbati) December 1, 2019