సాక్షి, హైదరాబాద్: తమతో పిల్లలు మరింత సమయం గడపాలని కోరుకుంటున్నారు కొందరు. అదే సమయంలో పిల్లల వేధింపులు తట్టుకోలేకపోతున్నామంటున్నారు. మరికొందరు. ఓ వయసు దాటిన తర్వాత అటు సమాజం ఇటు కుటుంబం రెండు వైపులా నిర్లక్ష్యాన్ని ఎదుర్కుంటున్న వృద్ధాప్యపు స్థితిగతులపై ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల వ్యాప్తంగా ‘హెల్పేజ్ ఇండియా’ ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహించింది. ఇందులో ఎన్నో ఆసక్తికర, ఆలోచించాల్సిన, తప్పకుండా స్పందించాల్సిన అంశాలు వెలుగు చూశాయి. అవి శాతాల వారీగా ఇలా...
ఎంతెంత దూరం..ఆరోగ్యం
► కీళ్లు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నవారు 78 శాతం
► డయాబెటిస్ తో 48 శాతం రక్తపోటు సమస్యతో 37 శాతం
► గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు 21 శాతం
► ఆరోగ్యం కోసం రోజూ నడక కొనసాగిస్తున్నారు 76 శాతం
► యోగా, ప్రాణాయామం చేసేవారు 21 శాతం
► సరైన పద్ధతిలో ఔషధాలు వాడుతున్నవారు 71 శాతం
► తమ ఆరోగ్యం పట్ల పిల్లలు శ్రద్ధ తీసుకోవాలంటున్నారు 50 శాతం
► ఆరోగ్య బీమా తమకు అన్ని విధాలా అందుబాటులో ఉండాలంది 43 శాతం
► ఆహారాన్ని నియంత్రిత పద్ధతిలో తీసుకుంటున్నది 69 శాతం
► సరైన ఆరోగ్య సేవలు పొందుతున్నది 32 శాతం
► బలహీనమైన కాళ్ల కారణంగా పడిపోతామని భయపడుతున్నవారు 37 శాతం
► కంటిచూపు తగ్గిందని బాధపడుతున్నవారు 37 శాతం
► ప్రైవేట్ ఆసుపత్రుల్లో, డయాగ్నసిస్ సెంటర్లలోనూ తమకు తక్కువ ధరకు వైద్య సేవలు లభించాలని ఆశిస్తోంది 35 శాతం
ఆర్థికం.. అంతంత మాత్రం..
► ఆర్థిక అవసరాల కోసం కుటుంబంపైనే ఆధారపడింది 67 శాతం
► ఆర్థిక భద్రత కలిగి ఉంది 58 శాతం
► పింఛను తదితరాలపై ఆధారపడ్డవారు 45 శాతం
పరివారం.. పరిస్థితి ఇదీ...
► కుటుంబ సభ్యుల నిరాదరణకు గురవుతున్నది 56 శాతం
► తరచూ కుటుంబ సభ్యుల చేత తిట్లు తింటోంది 36 శాతం
► పిల్లల చేతిలో దెబ్బలు తింటున్నవారు 18 శాతం
► తమ ఉనికిని కుటుంబం నిర్లక్ష్యం చేస్తోందంటున్నవారు 9 శాతం
► తమను ఆర్ధిక ఇబ్బందులు పెడుతున్నారంటున్నవారు 9 శాతం
► వేధింపుల నుంచి ఎలా బయటపడాలో తెలియని వారు 24 శాతం
► తమ కుటంబ సభ్యులకు కౌన్సెలింగ్ కావాలంటున్నవారు 71 శాతం
► సామాజిక వేధింపులకు గురవుతున్నామని అంటోంది 42 శాతం
ఇలా ఉన్నాం.. అలా ఉండాలనుకుంటున్నాం...
► సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నవారు 21 శాతం
► సమాజసేవకు సై అంటోంది 25 శాతం
► కుటుంబంతో సమయం గడుపుతున్నవారు 53 శాతం
► సెల్‌ఫోన్ వాడుతున్న వృద్ధులు 96 శాతం
► వీడియో కాల్ ద్వారా మాట్లాడుతున్నవారు 15 శాతం
► తమ వయసువారిని ముఖాముఖి కలుసుకుంటోంది 45 శాతం
► పిల్లలకు దూరంగా ఉన్న వృద్ధుల్లో పిల్లలకు దగ్గరగా ఉండాలనుకుంటున్నవారు 43 శాతం
► కుటుంబంతోనే ఉన్నప్పటికీ, తమ కుటుంబ సభ్యులు తమతో మరింత సమయం గడపాలని కోరుకుంటున్న వారు 61శాతం
► తమ సమస్యలపై సమాజం స్పందించాలని, ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆశిస్తోంది 53 శాతం
Comments
Please login to add a commentAdd a comment