అప్రమత్తతతో ప్రమాదాల నివారణ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : రహదారిపై వాహనాలు నడిపే ప్రతి డ్రైవరూ అప్రమత్తంగా వ్యవరిస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యమని ట్రాఫిక్ డీఎస్పీ మేకా సుధాకర్ అన్నారు. స్థానిక ఆర్టీసీ డిపో గ్యారేజ్‌లో శుక్రవారం ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డ్రై వర్లు విధులకు హాజరయ్యే ముందు మానసిక ప్రశాంతతో ఉండాలన్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ డ్రై వర్లు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలని సూచించారు.
ఏటా శిక్షణ తరగతులు
ఆర్టీసీలో డ్రై వర్లకు సంస్థ ఏటా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తూ వారిలో నైపుణ్యాభివద్ధికి తోడ్పడుతుందని ఆర్టీసీ డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎస్.మురళీకష్ణ అన్నారు. సంస్థలో చేరిన నాటి నుంచి ప్రమాద రహితంగా డ్రై వింగ్ చేస్తూ సంస్థకు గర్వకారణంగా నిలిచిన ఎందరో డ్రై వర్లు ఉన్నారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ ఏడాది ఇప్పటి వరకూ ప్రమాద బాధితులకు ఆర్టీసీ నష్టపరిహారంగా రూ.60 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని, ఈ సొమ్ము సంస్థకు మిగిలితే కార్మికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే అవకాశముండేదన్నారు. ఏలూరు డిపో మేనేజర్ ఎ.సుబ్రహ్మణ్యం, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.