న్యూయార్క్: స్మార్ట్‌ఫోన్లలో తీసిన ఫొటోను క్షుణ్నంగా పరిశీలించి అది ఏ ఫోన్‌ను ఉపయోగించి తీసిందో కనిపెట్టే కొత్త సాంకేతికతను శాస్త్రజ్ఞులు అభివృద్ధి చేశారు. భద్రత పరంగా వేలిముద్రలు, పాస్‌వర్డ్‌లు, పిన్ నంబర్లకు ఈ సాంకేతికత ప్రత్యామ్నాయం కాగలదనీ, దీనిని ఉపయోగించి సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని వారు చెబుతున్నారు. ప్రపంచంలో ఏ రెండు స్మార్ట్‌ఫోన్ల నుంచి తీసిన ఫొటోలు కూడా ఒకేలా ఉండవనీ, దీనికి కారణం ప్రతి ఫోన్ నుంచి తీసే ఫొటోల్లో చాలా సూక్ష్మమైన లోపాలు ఉండటమనేనని వారు వివరిస్తున్నారు. ఫొటో–రెస్పాన్స్ నాన్–యూనిఫామిటీగా పిలిచే ఓ కొత్త విధానం ద్వారా ఇలాంటి లోపాలను కనిపెట్టవచ్చనీ, తద్వారా ఏ ఫొటో ఏ ఫోన్ నుంచి తీసిందో గుర్తించగలరని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment