అశాంతితో దెబ్బతిన్న బంగ్లాదేశ్ నుండి భారత్‌లోకి చొరబడాలని చూస్తున్న అక్కడి ప్రజలను అడ్డుకునేందుకు ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని 480 కిలోమీటర్ల తీరప్రాంతంలో నిఘాను మరింతగా పెంచింది. ఈ విషయాన్ని సీనియర్ పోలీసు అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
ఒడిశా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బంగ్లాదేశ్‌కు చెందిన పలువురు చిన్న పడవలను ఉపయోగించి ఒడిశాలోకి అక్రమంగా ప్రవేశిస్తుంటారన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో అశాంతి నెలకొన్న సమయంలో, అక్కడి నేరస్తులు జైలు నుండి బయటకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. అలాంటి వారు భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించే అవకాశాలున్నయని, అందుకే తాము మరింత అప్రమత్తం అయ్యామన్నారు.
నేరస్తులలో పాటు సామాన్యులు కూడా ఒడిశాలోకి చొరబడే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని 18 మెరైన్ పోలీస్ స్టేషన్లను హై అలర్ట్‌లో ఉంచామన్నారు. మరోవైపు ఒడిశాలోకి బయటి వ్యక్తుల అక్రమ ప్రవేశాన్ని నిరోధించేందుకు ప్రత్యేకించి రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని కోస్తా జిల్లాల పోలీసు సూపరింటెండెంట్‌లను ఆదేశించింది. కేంద్రపారా, జగత్‌సింగ్‌పూర్, భద్రక్ తదితర జిల్లాలపై నిఘా సారించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment