ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : డీఎం | Measures to be taken to prevent accidents | Sakshi
Sakshi News home page

ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : డీఎం

Published Tue, Jul 26 2016 5:51 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : డీఎం - Sakshi

ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : డీఎం

కోదాడఅర్బన్‌: ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు తమ విధి నిర్వహణలో ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు వహించాలని కోదాడ ఆర్టీసీ డిపో మేనేజర్‌ శ్రీనివాసరావు సూచించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రమాద రహిత వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కోదాడ డిపోలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయాణికుల భద్రతే సంస్థ ప్రధాన విధి అని, ప్రమాద రహిత డ్రైవింగ్‌ సంస్థకు ప్రధాన ఆధారమని ఆయన అన్నారు. డ్రైవర్లు, సిబ్బంది ఆర్టీసీని ప్రమాదాల బారి నుంచిల కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ సైదులు, మెకానికల్‌ సూపర్‌వైజర్‌ బాలయోగి, ఆర్‌ఎం కార్యాలయ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ విజయ్, కార్మిక సంఘాల నాయకులు కేవీ రత్నం, సుధాకర్‌గౌడ్, సామేలు, సీతయ్య, ప్రసాద్, పలువురు కార్మికులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement