అనంతపురం న్యూసిటీ : వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముం దస్తు చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య విభాగం చీఫ్ ఇంజినీర్ (ఈఎన్సీ) పాండురంగరావు మునిసిపల్ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని ఓ హోటల్‌లో అనంతపురం నగరపాలక సంస్థ, హిందూపురం మునిసిపాలిటీ, కర్నూలు నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో ఈఎన్సీ సమావేశమయ్యారు.
మార్చి, ఏప్రిల్, మే వరకు నీటి సమస్య ఉండదన్నారు. హిందూపురంలో చాలా ప్రాంతాల్లో నీటి సమస్య ఉందని ఈఎస్‌సీ దృష్టికి మునిసిపల్ అధికారులు తీసుకెళ్లారు. నిధులు ఏమేరకు ఉన్నాయని ఎస్‌ఈ శ్రీనాథ్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ట్యాంకర్లకు వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను తప్పక అమర్చాలన్నారు. ఎన్ని కిలో మీటర్లు తిరిగినది, నీరు సరఫరా చేసిన విధా నం తప్పక నమోదు చేయాలన్నారు. ఇష్టారాజ్యంగా బిల్లులు పెడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించా రు. అలాగే గొ ల్లపల్లి రిజర్వాయర్ పైప్‌లైన్ పనులు ఎం త వరకు వచ్చాయని, వాటి డీపీఆర్‌ను పరిశీలించారు.
నీటి సమస్య లేదు : అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో నీటి సమస్య లేదని, పీఏబీఆర్ డ్యాంలో 2.5 టీఎంసీ నీరు నిల్వ ఉందని ఎస్‌ఈ సురేంద్రబాబు ఈఎన్సీకు వివరించారు. వేసవికాలంలో 0.6 నుంచి 0.7 టీఎంసీ ఉండే సరిపోతుందన్నారు. సమా వేశంలో కర్నూలు ఎస్‌ఈ శివరామిరెడ్డి, ఈఈ రాజశేఖర్, డీఈ రమణమూర్తి, హిం దూపురం కమిషనర్ విశ్వనాథ్, ఈఈ రమేష్, ఏపీఎండీసీ ఈఈ రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
డిసెంబర్‌లోపు పనులు పూర్తికావాలి