కొనసాగుతున్న కర్ఫ్యూ, ఆంక్షలు | Curfew, restrictions imposed to prevent protests in Kashmir | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న కర్ఫ్యూ, ఆంక్షలు

Published Fri, Jul 29 2016 9:06 AM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

కొనసాగుతున్న కర్ఫ్యూ, ఆంక్షలు

కొనసాగుతున్న కర్ఫ్యూ, ఆంక్షలు

శ్రీనగర్: కశ్మీర్లో పోలీసుల పహారా కొనసాగుతోంది. వేర్పాటువాదులు ఈ నెల 31 వరకు ఆందోళనలు  కొనసాగుతాయని ప్రకటించిన నేపథ్యంలో.. శ్రీనగర్ పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ, ఆంక్షలు కొనసాగుతున్నాయని సీనియర్ పోలీస్ అధికారి శుక్రవారం మీడియాతో వెల్లడించారు. అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా ప్రజలంతా సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వాని ఎన్కౌంటర్తో చెలరేగిన హింసతో ఇప్పటివరకు ఇద్దరు పోలీసులతో పాటు 48 మంది పౌరులు మృతి చెందారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ బుధవారం మాట్లాడుతూ.. అనంతనాగ్లో ఎన్కౌంటర్ జరిగిన సమయంలో బుర్హాన్ ఆ ఇంట్లో ఉన్న విషయం భద్రతా బలగాలకు తెలియదని.. ఒకవేళ తెలిస్తే లొంగిపోవడానికి అవకాశం ఇచ్చి ఉండేవారని పేర్కొన్న విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement