premature
-
తెల్లజుట్టే అని తేలిగ్గా తీసుకోవద్దు..!
తెల్లజుట్టు వృద్ధాప్యానికి సూచిక. కాని, వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు 20 దాటి 30లోకి అడుగుపెట్టేలోపే జుట్టు పండి΄ోతోంది. ఇటీవలి కాలంలో యువతరంలో ఈ సమస్య వేగంగా పెరుగుతోందంటున్నారు నిపుణులు. అకాలంలో జుట్టు నెరిసిపోవడాన్ని ‘కానిటీస్’ అని అంటారు. దీనికి ఆహారపు అలవాట్లు, పర్యావరణ మార్పులతోపాటు ఇంకా చాలా కారణాలే ఉన్నాయి. తలలో పేనుకొరుకుడు సమస్య తీవ్రమవుతున్నప్పుడు, థైరాయిడ్ ఎక్కువవుతున్నప్పుడు కూడా తెల్లజుట్టు వచ్చే అవకాశం ఉంటుంది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలు జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను తగ్గిస్తాయి. నలుపు రంగునిచ్చే మెలనిన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తాయి. దాంతో చిన్న వయసులోనే తల నెరిసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. పోషకాహార లోపం, పట్టణ జీవనశైలి కూడా ఈ పరిస్థితి కారణమవుతున్నాయని వారు చెబుతున్నారు. ఐరన్, కాపర్, విటమిన్ బి12 లోపంతో తెల్లజుట్టు విపరీతంగా పెరుగుతుంది. మరి యుక్తవయసులో వచ్చిన తెల్లజుట్టు తగ్గుతుందా? ఇదే ప్రశ్న నిపుణులను అడిగితే తగ్గుతుందనే అంటున్నారు. థైరాయిడ్ సమస్యలను తగ్గించుకోవడం, సక్రమంగా సమయానికి పోషకాహారం తీసుకోవడం ముఖ్యమంటున్నారు.(చదవండి: బ్రష్ మార్చి ఎంతకాలం అయ్యింది..?) -
ముందస్తు విత్‌డ్రాకు ఆర్బీఐ నిబంధనలు
ముంబై: ఎన్బీఎఫ్సీల్లో డిపాజిట్ చేసిన మూణ్నెల్ల వ్యవధిలోనే డిపాజిటర్లు అత్యవసర పరిస్థితుల కోసం మొత్తం డబ్బును వెనక్కి తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రిమెచ్యూర్ విత్డ్రాయల్స్పై వడ్డీ లభించదని పేర్కొంది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) నిబంధనలను సమీక్షించిన సందర్భంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. వైద్యం, ప్రకృతి వైపరీత్యాలతో పాటు ప్రభుత్వం ప్రకటించే విపత్తులను అత్యవసర పరిస్థితులుగా పరిగణిస్తారు. మరోవైపు, డిపాజిట్లు స్వీకరించే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీ) పాటించాల్సిన లిక్విడ్ అసెట్స్ పరిమాణాన్ని అవి ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లలో 13 శాతం నుంచి 15 శాతానికి ఆర్బీఐ పెంచింది. అలాగే, పబ్లిక్ డిపాజిట్లకు అన్ని వేళలా పూర్తి కవరేజీ ఉండేలా చూసుకోవాలని, ఏడాదికి ఒకసారైనా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నుంచి ’ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్’ రేటింగ్ పొందాలని హెచ్ఎఫ్సీలకు సూచించింది. పబ్లిక్ డిపాజిట్లను 12 నెలల నుంచి 60 నెలల్లోపు తిరిగి చెల్లించేయాల్సి ఉంటుంది. -
ఇలా చేస్తే చర్మం నిత్య యవ్వనంగా ఉంటుంది!
చర్మం ఎప్పటికి కాంతిమంతంగా ఉండాలంటే మన ఇంట్లో మనం నిత్యం ఉపయోగించవాటితో ఈజీగా పొందొచ్చు. ముఖ్యంగా కాల్షియం కోసం తాగే పాలతో ముఖాన్ని నిత్య యవ్వనంగా ఉండేలా చేసుకోవచ్చు. అంతేగాదు వార్థప్యపు లక్షణాలకు కూడా చెక్‌పెట్టొచ్చు. పాలతో చర్మ సౌందర్యం పెంచుకునే సింపుల్ చిట్కాలేంటంటే.. పాలతో చర్మ సౌందర్యం చర్మం కాంతిమంతంగా మెరవాలంటే క్రీమ్‌లు లోషన్లకు బదులు ఇంట్లో ఉండే పాలతో ప్రయత్నించి చూడండి. పచ్చి పాలలో దూదిని ముంచి మెడ, గొంతు, ముఖాన్ని తుడిస్తే చర్మం మీద పట్టేసిన మురికి (సబ్బుతో శుభ్రం చేసినప్పటికీ వదలని మురికి) వదిలిపోతుంది. రెండు టీ స్పూన్ల పచ్చిపాలలో టీ స్పూన్ శనగపిండి, రెండు చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కొద్దిగా నీటిని చల్లి వలయాకారంగా మసాజ్ చేస్తూ శుభ్రం చేయాలి. ముఖం మీద సన్నని గీతలతో చిన్న వయసులోనే వార్థక్యపు లక్షణాలు కనిపిస్తుంటే రోజూ మిల్క్ ప్యాక్ వేయాలి. ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసిన తర్వాత పచ్చి పాలలో దూదిని ముంచి ముఖం మీద అద్దాలి. పాలు ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేసి పెసరపిండి ప్యాక్ వేయాలి. రెండు టీ స్పూన్ల పెసర పిండిలో రెండుచుక్కల తేనె వేసి తగినంత నీటితో కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే చర్మం నిత్య యవ్వనంతో ఉంటుంది. వార్థక్య లక్షణాలు దూరమవుతాయి. (చదవండి: గ్రీన్ టీ మంచిదని తాగేస్తున్నారా? దానివల్ల ఎదురయ్యే సమస్యలివే..!) -
1600 లీటర్ల చనుబాలు దానం.. గిన్నీస్ రికార్డ్ కెక్కిన మాతృమూర్తి..
తల్లి పాల గొప్పతనం అందరికీ తెలుసు. శిశువుకు ప్రాణాధారం అయిన అలాంటి తల్లిపాలు ఇవ్వడంలో గిన్నీస్ రికార్డ్ సాధించింది అమెరికాకు చెందిన ఎసిలబెత్ అండర్సన్. ఏకంగా 1600 లీటర్ల పాలను ఇచ్చి ఎందరో శిశువుల ఆకలి తీర్చింది. తనకు ఉన్న లోపాన్నే ఆయుధంగా చేసుకుని ప్రపంచ రికార్డ్ సాధించింది. అమెరికాలోని ఒరెగాన్కు చెందిన ఎలిసాబెత్ అండర్సన్ సియెర్రాకు ఇద్దరు సంతానం. ఆమెకు హైపర్ లాక్టేషన్ సిండ్రోమ్ కారణంగా పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేవి. ఈ క్రమంలో తన భర్త ఉండే ప్యూర్టెరికో ద్వీపానికి వెళ్లినప్పుడు తల్లిని కోల్పోయిన ఓ బిడ్డకు ఎలిసబెత్ పాలను ఇచ్చారు. ఆ తర్వాత ఆ సహాయాన్ని కొనసాగించారు. ఇలా చాలా మంది శిశువులకు పాలను ఇచ్చారు. 2015 నుంచి 2018 మధ్యలో 1600 లీటర్ల చనుబాలను పాల బ్యాంకులకు అందించారు. దీంతో ప్రపంచంలోనే ఈ స్థాయిలో పాలను దానం చేసిన జాబితాలో గిన్నీస్ రికార్డ్ సాధించారు. గిన్నీస్ రికార్డ్ సాధించడం గౌరవంగా ఉందని ఎలిసబెత్ సియెర్రా తెలిపారు. తన లోపంతోనూ ఎందరో చిన్నారులకు ఆకలి తీరిందని అన్నారు. ప్రోలాక్టిన్ అత్యధికంగా ఉత్పత్తి కావడంతో ఎలిసబెత్‌కు పాలు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయని డాక్టర్లు తెలిపారు. దీని కారణంగానే ఆమె పాలను దానం చేయగలుగుతున్నారని వెల్లడించారు. ఇదీ చదవండి: మళ్ళీ నోరుజారిన అమెరికా ఉపాధ్యక్షురాలు.. స్క్రిప్టు యధాతధంగా చదివి.. -
చైనాను భారత్ భర్తీ చేస్తుందనడం తొందరపాటే..
దావోస్: ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో చైనాను భారత్ భర్తీ చేస్తుందని భావించడం.. తొందరపాటే (ప్రీమెచ్యూర్) అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం అన్నారు. భారత్ ఎకానమీ చాలా చిన్నదని పేర్కొంటూ, ప్రపంచ ఎకనామీని ప్రభావితం చేసే స్థాయి ఇప్పుడే దేశానికి లేదని పేర్కొన్నారు. అయితే, భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నందున దేశ ఎకానమీ మరింత వృద్ధి చెందుతూ, పరిస్థితి (ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసే విషయంలో) మున్ముందు మారే అవకాశం ఉందని కూడా విశ్లేషించారు. 2023లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్నే ఎదుర్కొనే అవకాశం ఉందంటూ ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) విడుదల చేసిన ఒక నివేదిక సందర్భంగా రాజన్ విలేకరులతో మాట్లాడారు. చైనా ఆర్థిక వ్యవస్థలో ఏదైనా పునరుద్ధరణ జరిగితే, అది ఖచ్చితంగా ప్రపంచ వృద్ధి అవకాశాలను పెంచుతుందని అన్నారు. ఈ సమయంలో విధాన రూపకర్తలు కార్మిక మార్కెట్‌తో పాటు హౌసింగ్ మార్కెట్ పరిస్థితులపై కూడా దృష్టి సారిస్తున్నారని అన్నారు. అమెరికాను ప్రస్తావిస్తూ, అక్కడ గృహాల విక్రయాలు జరగడం లేదని, అయితే ధరలు కూడా తగ్గడం లేదని అన్నారు. ‘ఇదంతా అంధకారమా లేక వినాశనమా? బహుశా కాకపోవచ్చు. రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించుకుంటే, ఖచ్చితంగా పరిస్థితి అంతా మారిపోతుంది’’ అని రాజన్ పేర్కొన్నారు. ‘‘2023లో ఇంకా 12 నెలల సమయం ఉంది. రష్యా యుద్ధం నిలిచిపోయినా, చైనా పురోగతి సాధించినా ప్రపంచ ఎకానమీ మెరుగుపడుతుంది’’’ అని ఆయన విశ్లేషించారు. చైనా ఎకానమీ మార్చి, ఏప్రిల్ నుంచి రికవరీ సాధించే అవకాశం ఉందని కూడా రాజన్ అంచనా వేశారు. -
పుతిన్- బైడెన్ల అత్యవసర భేటీ!
Russia Says Premature Talk: ఉక్రెయిన్‌పై రష్యా ఉద్రిక్తతలను శాంతింపజేయడానికి పారిస్ సమావేశం జరిగే అవకాశం ఉందని ప్రకటించిన నేపథ్యంలో రష్యా అమెరికా అధ్యక్షుల శిఖరాగ్ర సమావేశం నిర్వహించేందుకు రంగం సిద్ధమైందని రష్యా ప్రభుత్వ యంత్రాంగం పేర్కొంది. ఈ మేరకు రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశమయ్యేందుకు సూత్రప్రాయంగా ఒప్పందం కుదిరిందని ఫ్రెంచ్ ప్రెసిడెన్సీ సోమవారం ప్రకటించింది. ఈ శిఖరాగ్ర సమావేశం జరగాలంటే మాస్కో సైన్యం ఉక్రెయిన్ పై దాడి చేయకూడదని అమెరికా పేర్కొంది. నిజానికి ఏదైన శిఖరాగ్ర సమావేశాలను నిర్వహించడానికి ఒక నిర్ధిష్ట ప్రణాళిక ఉంటుంది. కానీ ఈ సమావేశం ఎలాంటి ప్రణాళికలు లేని అత్యవసర సమావేశంగా రష్యా అభివర్ణించింది. అయితే విదేశాంగ మంత్రుల స్థాయిలో ఈ చర్చలు కొనసాగించాలని నిర్ణయించింది. అంతేకాదు అత్యవసరం అనుకుంటే రష్యా, అమెరికా అధ్యక్షులు టెలిఫోన్ కాల్ ఏదా ఇతర పద్ధతుల ద్వారా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని రష్యా ప్రతినిధి తెలిపారు. అయితే దేశాధినేతలు సముచితంగా భావిస్తేనే ఈ సమావేశం సాధ్యమవుతుందని చెప్పారు. పైగా క్రెమ్లిన్ భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పుతిన్ అధ్యక్షత వహించబోతున్నారు. మరోవైపు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురవారం యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో జరగనున్న షెడ్యూల్ చర్చలకు ముందు ఫ్రెంచ్ కౌంటర్ జీన్-వైవ్స్ లే డ్రియన్‌తో టెలిఫోన్లో మాట్లాడాలని భావిస్తున్నారు. ఉక్రెయిన్ చుట్టు రష్యా దళాలు మోహరించి ఉండటమే కాక యుద్ధ భయాల్ని విపరీతంగా పెచ్చింది. అంతేగాక తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూల వేర్పాటువాదులకు ఉక్రెయిన్ సైన్యానికి మధ్య జరుగుతున్న యుద్ధమే ఈ ఉద్రిక్తలకు మరింత పెరిగిపోవడానకి కారణమైంది. ప్రజల ప్రాణాలకు అపాయం కలిగించేలా ఉక్రేనియన్ సైన్యం చేస్తున్న రెచ్చగొట్టే, దూకుడు చర్యల గురించి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు రష్యా ప్రతినిధి తెలిపారు. (చదవండి: చైనాతో అత్యంత క్లిష్టంగా సంబంధాలు) -
Vidya: చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి.. నేనే ఉద్యోగం ఇస్తాను..
ఎం.ఎస్.సి డిజిటల్ సొసైటీ కోర్స్‌లో గోల్డ్ మెడలిస్ట్ ఆమె. కాని ఆమె ఫ్రెండ్స్ అందరికీ క్యాంపస్ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు వచ్చాయి. ఆమెకు రాలేదు. ‘మీరు చూడగలిగితే బాగుండు’ అన్నారు అంతా. విద్యా పుట్టుకతో అంధురాలు. కాని అందరూ నిరాకరిస్తున్నా మేథమెటిక్స్‌లో గొప్ప ప్రావీణ్యం సంపాదించింది. ‘నాకు ఉద్యోగం ఇవ్వడం కాదు.. నాలాంటి వారికి నేనే ఉద్యోగాలు కల్పిస్తాను’ అని స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉపాధి చూపిస్తోంది విద్య. ఆమె ఎదుర్కొన్న అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. ఆమె సాధిస్తున్న గెలుపులు కూడా. ‘ప్రపంచంలోని అంధుల జనాభాలో మూడొంతుల మంది భారతదేశంలో ఉన్నారు. వారిలో 70 శాతం మంది పల్లెల నుంచే ఉన్నారు. మన దేశంలో అంధ బాల బాలికల్లో 68 శాతమే చదువుకోవడానికి వెళుతున్నారు. వీరిలో మళ్లీ మేథ్స్, సైన్స్ వంటివి తీసుకోవడానికి స్కూల్స్ అంగీకరించవు. సాధారణ కోర్సులే వీళ్లు చదవాలి. ఏం? ఎందుకు వీళ్లు మేథ్స్ చదవకూడదు?’ అంటుంది విద్య. బెంగళూరుకు చెందిన ఈ పాతికేళ్ల అమ్మాయి ఎం.ఎస్.సిలో గోల్డ్ మెడల్ సాధించి ఇప్పుడు ‘విజన్ ఎంపవర్’ అనే సంస్థ స్థాపించి దేశంలోని అంధ విద్యార్థినీ విద్యార్థులకు మేథ్స్, సైన్స్ చదవడంలో మెటీరియల్ తయారు చేస్తోంది. వారి కోసం ట్యూషన్లు, క్లాసులు ఏర్పాటు చేస్తుంది. వారికై పని చేసే అంధ టీచర్లనే సిద్ధం చేస్తోంది. ఒకప్పుడు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు విద్యకు. కాని ఇప్పుడు విద్యే తన సంస్థ ద్వారా అంధ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రిమెచ్యూర్ రెటినోపతి విద్య బెంగళూరు సమీపంలోని పల్లెటూరిలో పుట్టింది. సాధారణ జననమే. కాని పుట్టాక మూడు నెలలు ఇంక్యుబేటర్‌లో పెట్టాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రిమెచ్యూర్ రెటినోపతి వల్ల ఆమె రెండు కళ్లకూ చూపు పోయింది. ప్రపంచ సాక్షరతా దినోత్సవం రోజు పుట్టడం వల్ల, ఆమెకు వైద్యం చేసిన డాక్టర్ ‘పాపకు ఎలాగూ కళ్లు రావు. కాని బాగా చదివిస్తే తన కాళ్ల మీద తాను నిలబడుతుంది’ అని సలహా ఇవ్వడం వల్ల తల్లిదండ్రులు ‘విద్య’ అని పేరు పెట్టారు. ‘సాధారణంగా మన దేశంలో జరిగే తప్పేమిటంటే అంధ పిల్లలకు భవిష్యత్తు ఉండదని వారిని బడికి పంపరు పల్లెటూళ్లలో. నా అదృష్టం నా తల్లిదండ్రులు నన్ను బెంగళూరులోని ఒక మిషనరీ స్కూల్లో 7 ఏళ్ల వయసులో వేశారు. అక్కడే నేను 7 వ క్లాస్ వరకూ స్పెషల్ స్టూడెంట్‌గా చదువుకున్నాను. కాని అసలు సమస్య నా 8 వ తరగతి నుంచి అందరిలాగే మామూలు బడిలో చదువుకునే సమయంలో మొదలైంది‘ అంటుంది విద్య. లెక్కల పిచ్చి విద్యకు చిన్నప్పటి నుంచి లెక్కల పిచ్చి. ఇంట్లో చేటలో తల్లి బియ్యం పోసిస్తే ప్రతి గింజను లెక్క పెట్టేది. బియ్యం ఏమిటి... ఆవాలు పోసిచ్చినా ప్రతి ఆవాల గింజను లెక్క పెట్టేది. తల్లిదండ్రులు ఆమె లెక్కల ఇష్టాన్ని గమనించారు. కాని హైస్కూల్లో లెక్కలు చదవడం ఆమెకు కష్టమైంది. క్లాసులన్నీ బోర్డు మీద రాతలతో ఉంటాయి. మేథమెటికల్ సింబల్స్ ఉంటాయి. డయాగ్రామ్స్ ఉంటాయి. వీటిని చూడకుండా అర్థం చేసుకోవడం అసాధ్యం. కాని విద్య పట్టుదలగా వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించేంది. ‘నేను చేయాల్సింది మరిన్ని గంటలు కష్టపడటమే అని అర్థం చేసుకున్నాను. ఉదయం నాలుగున్నరకు లేచి చదివేదాన్ని’ అంటుంది విద్య. డిగ్రీలో మేథ్స్, కంప్యూటర్ సైన్స్ తీసుకుని కంప్యూటర్లో ఆడియో మెటీరియల్ ద్వారా వీలైనంత చదువుకుంటూ పాస్ అయ్యింది. ఆ తర్వాత బెంగళూరులో ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటిలో ఎంఎస్సీ డిజిటల్ సొసైటీ కోర్సును టాపర్‌గా పాసైంది. ‘నా చదువుంతా నా ప్రయోగమే. నేను గణితాన్ని అర్థం చేసుకోవడానికి పడిన తపన, కష్టమే నా చదువు. ట్రిపుల్ ఐటి నుంచి మేథమేటిక్స్ ఆధారిత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి స్టూడెంట్‌ని నేనే’ అంటుంది విద్య. అందరి కోసం విద్యకు ఉద్యోగం ఇవ్వడానికి కంపెనీలు నిరాకరించాయి ఆమె అంధత్వం వల్ల. చాలా కంపెనీలు దయతలిచి కాల్‌సెంటర్ ఆపరేటర్ ఉద్యోగాన్ని ఆఫర్ చేశాయి. ఇంత మేధ పెట్టుకుని చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి అనుకుంది విద్య. అసలు అంధులు అన్ని విధాలా మేథ్స్, కంప్యూటర్స్ చదివి పెద్ద ఉద్యోగాలు చేసేలా వారిని తయారు చేస్తాను అని ఉద్యోగప్రయత్నాలు మాని తానే ఉద్యోగాలు చూపే ‘విజన్ ఎంపవర్’ అనే సంస్థను బెంగళూరులో స్థాపించింది. నాలుగేళ్లుగా ఈ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అంధ విద్యార్థులకు బాసటగా నిలుస్తోంది. అంతేకాదు ప్రస్తుతానికి కర్నాటకలోని అంధ విద్యార్థులను ప్రపంచ అంధ విద్యార్థులతో, విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తోంది. విద్య చేస్తున్న ఈ పనిని సమాజం గుర్తిస్తోంది. ఆమెను పిలిచి స్ఫూర్తివంతమైన ప్రసంగాలను వింటోంది. ‘అప్పుడే ఏమైంది. ఇది మొదలు మాత్రమే. చేయాల్సింది చాలా ఉంది’ అంటోంది విద్య. చాలా కంపెనీలు దయతలిచి కాల్‌సెంటర్ ఆపరేటర్ ఉద్యోగాన్ని ఆఫర్ చేశాయి. ఇంత మేధ పెట్టుకుని చిన్న ఉద్యోగం ఎందుకు చేయాలి అనుకుంది విద్య. అసలు అంధులు అన్ని విధాలా మేథ్స్, కంప్యూటర్స్ చదివి పెద్ద ఉద్యోగాలు చేసేలా వారిని తయారు చేస్తాను అని ఉద్యోగ ప్రయత్నాలు మాని తానే ఉద్యోగాలు చూపే సంస్థను స్థాపించింది. -
పుట్టడానికెందుకురా తొందర!
సాక్షి, హైదరాబాద్ : నెలలు నిండని శిశువులు భారత్‌లోనే ఎక్కువగా పుడుతున్నారు. ప్రపంచంలో మన దేశంలోనే ఆ సంఖ్య ఎక్కువుండటం ఆందోళన కలిగిస్తోంది. నెలలు నిండకుండా పుట్టిన శిశువుల్ని వివిధ అనారోగ్య సమస్యల బారి నుంచి కాపాడుకోవడం సవాల్‌గా మారింది. గర్భిణుల్లో ఇన్ఫెక్షన్, ఇతరత్రా అనారోగ్య సమస్యల వల్ల శిశువులు నెలలు నిండకుండా పుడతారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా కోటిన్నర మంది పిల్లలు ఇలా నెలలు నిండకుండా పుడుతున్నారు. అందులో 35 లక్షల మంది భారత్‌లోనే పుడుతున్నారు. ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు, భారత్‌లో ప్రతీ ఎనిమిది మందిలో ఒకరు ఇలా పుడుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో 60% మంది దక్షిణాసియా, ఆఫ్రికాలోనే నెలలు నిండకుండా పుడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. నేడు (నవంబర్ 17, మంగళవారం) వరల్డ్ ప్రిమెచ్యూరిటీ డే. నెలలు నిండని పిల్లలు పుట్టకుండా, పుట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నదే ‘ఈ రోజు’ ముఖ్యోద్దేశం. 37 వారాల కంటే ముందే పుట్టడం సాధారణంగా గర్భధారణ సమయం 40 వారాలు. సరిగ్గా నెలలు పూర్తయి పుడితే సహజంగా అనారోగ్య సమస్యలుండవు. 37 వారాల కంటే ముందు పుడితే వారిని నెలలు నిండని శిశువు అంటారు. అలాంటి వారిలో అనారోగ్య సమస్యలుంటాయి. గర్భిణీకి ఇన్ఫెక్షన్ రావడం, కవలలు ఉండటం వల్ల గర్భాశయం ఇరుకుగా మారడం, అలాగే ముఖద్వారం వదులుగా ఉండటం వంటి కారణాలతో నెలలు నిండకుండా శిశువులు పుడతారు. గర్భిణుల్లో ప్రత్యేక కారణాల వల్ల బీపీ పెరగడం, కాలేయంలో సమస్యలు ఏర్పడటం వల్ల కూడా నెలలు నిండకుండానే ప్రసవమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కవల పిల్లల్లో 60 – 70 శాతం మంది నెలలు నిండని వారేనని వైద్య నిపుణులు అంటున్నారు. నెలలు నిండకుండా పుట్టేవారు కిలో కంటే తక్కువ బరువుంటే అతి తీవ్ర అనారోగ్య సమస్యలు ఉంటాయి. 20 ఏళ్ల క్రితం దేశంలో కిలో కంటే తక్కువ బరువున్న నెలలు నిండని పిల్లల్లో 40 శాతం మాత్రమే బతికేవారు. ప్రస్తుతం అత్యాధునిక వైద్య వసతుల వల్ల అది 60 నుంచి 70 శాతానికి పెరిగింది. ఎయిమ్స్ వంటిచోట 65 శాతం, అంతర్జాతీయ ప్రమాణాలున్న ఆసుపత్రుల్లో 80 శాతం మంది బతుకుతున్నారు. అలాగే స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ (ఎస్ఎన్సీయూ)ను కేంద్ర ప్రభుత్వం ప్రతీ జిల్లాలో ఏర్పాటుచేసింది. దీంతో నెలలు నిండనివారిని కాపాడుకోవడం సాధ్యమవుతోంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ►శిశువు కిలో కంటే తక్కువ బరువున్నట్టు భావిస్తే.. వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. ►పుట్టగానే డెలివరీ రూమ్‌లోనే వారికి అవసరమైన సంరక్షణ చేయాలి. నెలలు నిండని శిశువులు చలికి తట్టుకోలేరు. కాబట్టి వార్మర్ పెట్టాలి. ప్లాస్టిక్ పాలిథిన్ కవర్ శరీరానికి చుట్టాలి. ►అవసరం మేరకు ఆక్సిజన్ వాడాలి. శ్వాసపరమైన ఇబ్బంది ఉంటే ప్రత్యేకంగా సరఫరా చేయాలి. దీంతో వెంటిలేటర్‌పైకి వెళ్లకుండా ఆపొచ్చు. ►నెలలు నిండని శిశువుల్ని ఇంక్యుబేటర్‌లో పెట్టడం ద్వారా కాపాడుకోవచ్చు. ►తల్లిపాలు దివ్యౌషధం. జీర్ణవ్యవస్థ, పరిణితి చెందడానికి ఇవి సాయపడతాయి. ►ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోవాలి. అవసరమైతేనే శిశువులను తాకాలి. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ►ఒక బిడ్డ నుంచి ఇతర బిడ్డలకు ఇన్ఫెక్షన్ కాకుండా చూసుకోవాలి. అవసరమైతే యాంటీ బయోటిక్స్ వాడాలి. ►చిన్నపిల్లలను చూసే యూనిట్లలో ఇంటెన్సివ్ కేర్ అందించాలి. రణగొణ ధ్వనులు ఉండకూడదు. అనవసరంగా లైట్లు వేయకూడదు. ►క్లస్టర్ కేర్ ద్వారా బిడ్డను సంరక్షించాలి. కొన్ని రకాల మందులివ్వాలి. తల్లికి పోషకాహారం ఇవ్వాలి నెలలు నిండకుండా శిశువులు పుట్టడాన్ని ఆపే వీలుంది. అందుకోసం ముందునుంచీ తల్లికి సరైన పోషకాహారమివ్వాలి. రక్తహీనత లేకుండా చూసుకోవాలి. ప్రెగ్నెన్సీ రాగానే డాక్టర్‌ను సంప్రదించాలి. ప్రతి నెలా పరీక్షలు చేయించుకోవాలి. గర్భాశయ ముఖద్వారం వదులుగా ఉంటే కుట్లు వేయాలి. గతంలో నెలలు నిండని శిశువులను కని ఉంటే, మరోసారి అలా జరగకుండా స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు ఇస్తారు. గర్భాశయ నిర్మాణంలో సమస్యలుంటే ముందే చికిత్స చేయించుకోవాలి. గర్భంలో కవల పిల్లలున్నట్లు గుర్తిస్తే ప్రతి నెలా డాక్టర్‌ను సంప్రదించాలి. ఇలా చేయడం వల్ల నెలలు నిండకుండానే శిశువులు పుట్టకుండా చాలా మేరకు ఆపొచ్చు. – డాక్టర్ విజయానంద్, ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు, రెయిన్బో ఆస్పత్రి, హైదరాబాద్ -
అతి భౌతిక శ్రమతో అకాల మరణం!
మీ ఉద్యోగంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుందా? అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నింపాదిగా కూర్చుని పనిచేసే వారితో పోలిస్తే.. శారీరక శ్రమ ఎక్కువైన ఉద్యోగులు అకాల మరణం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ హెచ్చరిస్తోంది. చాలా రకాల వ్యాధులను అడ్డుకోవడంలో వ్యాయామం కీలకమన్నది మనకు తెలిసిన విషయమే. ఉద్యోగంలో చేసే శారీరక శ్రమతో సంబంధం లేకుండా రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలని, తద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. అయితే ఉద్యోగంలో భాగంగా ఎక్కువగా శ్రమపడే వారి విషయం లో మాత్రం ఇది వ్యతిరేక ఫలితాలిస్తుందని తాజా అంచనా. 1960 – 2010 మధ్యకాలంలో దాదాపు రెండు లక్షల మంది నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం జరిగిందని.. శారీరక శ్రమ ఎక్కువగా ఉన్న వారు తొందరగా మరణించడానికి 18 శాతం ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఈ అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయనం నేపథ్యంలో ప్రభుత్వాలు, ఆరోగ్య సంస్థలు ప్రజలకు తగిన సూచనలు జారీ చేసేందుకు అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
కుక్కల్లో కూడా అంతేనట..!
వాషింగ్టన్: అధిక ఒత్తిడి కారణంగా మానవులలాగానే కుక్కలు కూడా ప్రభావితమవుతాయట. తీవ్రమైన మానసిక ఒత్తిడి ఫలితంగా వాటి బొచ్చుకూడా ముందుగానే తెల్లబడిపోతుందట. తాజా అధ్యయనంలో పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. ఎక్కువ స్ట్రెస్ మూలంగా కుక్కల్లో కూడా ప్రీ మెచ్యూర్ గ్రే హెయిర్ ను గుర్తించినట్టు కొలరాడో పరిశోధకులు చెబుతున్నారు. కొలరాడో లో పరిశోధకులు 1-4 వయస్సున్న 400 ముదురు రంగు కుక్కలపై ఈ పరిశోధన జరిపారు. వాటి నమూనాలు ఛాయా చిత్రాలను సేకరించారు. మరోవైపు వాటి ఆరోగ్యం, ప్రవర్తనాతీరుపై అడిగి తెలుసుకునేందుకు వాటి యాజయానులకు ఒక ప్రశ్నాపత్రాన్ని అందించారు. పరిశోధన తరువాత కూడా ఫోటోలను పరిశీలించారు. దీంతో ముందు అస్పలు తెల్లగా లేని కుక్కల బొచ్చు పూర్తిగా తెల్లగా మారిపోయినట్టు గుర్తించారు. కుక్కల ఆరోగ్యం కూడా తీవ్రమైన ఒత్తిడి, మానసిక ఆందోళన ప్రభావం చూపే అవకాశాలున్నట్టు తేల్చారు. వ్యాకులత, మానసిక ఆందోళన అధిక స్థాయిలో ఉన్న కుక్కల్లో బూడిద జుట్టును ఉంటుందని తెలివపారు. పెద్ద శబ్దాలచేయడం, ఏదో తెలియని భయంతో ఉన్నట్టుగా ప్రవర్తించడం దీనికి సంకేతాలని తెలిపారు. మానవులు భయపడినట్టుగానే ఇవికూడా ప్రవర్తిస్తాయని , ఈ ప్రవర్తనను గుర్తించాలని సూచించారు. ముఖ్యంగా 4 ఏళ్లలోపు కుక్కల్లో కనిపించే 'గ్రే మజిల్' ఆందోళన లేదా ఇతర భయం సంబంధితమైన ఆందోళనకు పరిస్థితులు హెచ్చరిక సంకేతం కావచ్చని పరిశోధకులు తెలిపారు.అంతేకాదు మగ కుక్కలతో పోలిస్తే ఆడకుక్కల్లోనే ఒత్తిడి ఎక్కువ అని కూడా తేల్చారు. మగ కుక్కలతో పోలిస్తే ఆడకుక్కల బొచ్చు చాలా తొందరగా తెల్లబడుతునట్టు ఈ అధ్యయనం లో తేలింది. ఈ పరిశోధనా పత్రాన్ని అప్లైడ్ యానిమల్ బిహేవియర్ సైన్స్ జర్నలో ప్రచురించారు. ''క్వైట్ స్ట్రైకింగ్" గా ఈ రిపోర్టును అభివవర్ణించబడింది. -
పీఎఫ్ లో మరో రగడ
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ వో) వ్యవహారంలో రోజుకో వివాదం రగులుతోంటే..తాజాగా మరో సరికొత్త విధానం అమలుకు సంస్థ రంగం చేసింది. పీఎప్ ముందస్తు ఉపసంహరణల నిరోధకం కోసం అంటూ చేపట్టిన 'ఒక ఉద్యోగికి ఒక భవిష్యనిధి ఖాతా పథకాన్ని' ఈ మే ఒకటి నుంచి అమల్లోకి తీసుకు రానుంది. దీనిద్వారా ఉద్యోగుల దీర్ఘకాలిక ప్రయోజనాలను కాపాడాలని సంస్థ భావిస్తోంది. దీంతో ఉద్యోగులు.. ఉద్యోగం మారిన ప్రతిసారి పీఎఫ్ ఖాతా తెరవాల్సిన అవసరముండదని, పీఎఫ్ సొమ్ము విత్ డ్రాయల్ తెరపైకి రాదని సంస్థ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సుదీర్ఘంగా పీఎఫ్ అకౌంట్ నిర్వహిస్తే వచ్చే లాభాలను కల్పించడానికే ఈ నిర్ణయ తీసుకున్నట్టు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ చెబుతోంది. ఏప్రిల్ 21 న జరిగిన ఈపీఎఫ్ వో అంతర్గత సమావేశంలో మాట్లాడిన కమిషనర్ వీపీ జోయ్ ఈ విషయాన్నిఈ విషయాన్ని ధృవీకరించారు. మే 1 వతేదీన ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. ఈపీఎఫ్ సేవలు మెరుగ్గా ఉంటే ..ఎక్కువ మంది స్వచ్ఛందంగా ఈపీఎఫ్ లో చేరడానికి ఉత్సాహం చూపుతారన్నారు. పీఎఫ్ ఖాతాల నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని యజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవన్నారు. అటు ప్రావిడెంట్ ఖాతాల నిర్వహణలోకి రాష్ట్ర ప్రభుత్వాలను కూడా భాగస్వామ్యం చేసే దిశగా ఈపీఎఫ్ సంస్థ ఆలోచిస్తోంది. మున్సిపాలిటీల్లోని ఉద్యోగులందరికీ పీఎఫ్ ఖాతాలు ఉండాలనే అభిప్రాయంతో ఆమేరకు చర్యలకు ఉపక్రమించింది. పీఎఫ్ ఖాతా నిర్వహణ, పింఛన్ వంటవి వాటిని ఉద్యోగులకు అనుకూలంగా, మారిస్తే ఫీఎఫ్ ఖాతాలను సుదీర్ఘ కాలంగా కొనసాగిస్తారని ఈఫీఎఫ్ సంస్థ భావిస్తోంది. ఈనేపథ్యంలోనే 58 సంవత్సరాలలోపు పీఎఫ్ విత్డ్రాయల్స్పై నిషేధం విధించాలని ఆలోచన చేసింది. అయితే దేశ వ్యాప్తంగా దీనిపై ఉద్యోగ, కార్మిక వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో పునరాలోచనలో పడ్డ ఈఫీఎఫ్ సంస్థ ప్రత్యామ్నాయ పరిష్కారాలను ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఒక ఉద్యోగికి ఒకే పీఎఫ్ ఖాతా అన్న విధానాన్ని అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడంతో గుర్రుగా ఉన్న ఉద్యోగులు దీనిపై ఎలా స్పందించనున్నారో చూడాలి. -
లక్షలమందిని ఆకట్టుకుంటున్న కవలలు!
కవల పిల్లలు పుట్టడమే ఓ వింతగా కనిపిస్తుంది. నవజాత శిశువుల్ని చూసేందుకు కూడ అందరూ ఎంతో ఇష్టపడతారు. అటువంటిది ఆ పిల్లలు ఒకరికొకరు చేతులు పట్టుకొని మరీ పుట్టారంటే నిజంగా అది వింతే కదా! అందుకేనేమో ఇప్పుడు ఆ పసివాళ్ళ వీడియో ఫేస్ బుక్ యూజర్లను కట్టి పడేస్తోంది. ఆంథియా జాక్సన్, రూస్ ఫోర్డ్ ల కు పుట్టిన నవజాత శిశువులు క్రిస్టినా, క్రిస్టియన్ లు. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పుట్టిన ఆ పిల్లలు తల్లిదండ్రులకే ఎంతో ఆశ్చర్యం కలిగించారు. అందుకేనేమో ఆ పిల్లల మురిపాన్ని అందరితో పంచుకోవాలనుకున్న తల్లిదండ్రులు వారిద్దరినీ వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియోను కోటీ డెభ్భై లక్షలమంది చూశారు. అంతే కాదు లక్షా అరవై వేల మంది షేర్ కూడ చేశారు. అసలు తల్లి గర్భంలో ఉండాల్సిన కన్నా 11 వారాల ముందే... అంటే 28 వారాలకే పుట్టిన ఆ నవజాత శిశువులు ఒక్కొక్కరూ ఓ కేజీ మాత్రమే బరువున్నారు. అయితేనేం చేయీ చేయీ పట్టుకొని ముందుకు నడుద్దాం అన్నట్లుగా ఎంతో ఉత్సాహంగా కనిపించడం ఇప్పుడు అందర్నీఅకట్టుకుంటోంది. వీడియోను అనేకమంది ఇష్టంగా చూస్తుండటంతో తల్లి ఆంథియా.. ఆ కవల పిల్లల మరిన్ని ఫోటోలను ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తో పోస్ట్ చేసింది. అయితే దానికి వెనుక ఆతల్లి మనసు ఆరాటం ఉంది. తన పిల్లలు ప్రీమెట్యూర్డ్ గా పుట్టడంతో వారి శ్రేయస్సును కాంక్షిస్తూ ఇతర తల్లిదండ్రులు ఇచ్చే సలహాలను ఆమె ఆశిస్తోంది. అటువంటి పిల్లల పెంపకంపై అనుభవజ్ఞులైనవారి నుంచి సలహాలను కూడ ఆ తల్లి కోరుకుంటోంది. '' ప్రిమెట్యూర్ కవలలు పుట్టడంతో నేను చాలా ఖంగారు పడ్డాను. అయితే వారు కాస్త స్థిరపడటంతో ఊపిరి పీల్చుకున్నాను. నేను వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయడానికి చిన్న కారణం ఉంది. తల్లిదండ్రులంతా ఇచ్చే కామెంట్లతో నాలో ధైర్యం కలుగుతుందని ఆశించాను.'' అంటూ ఆంథియా ఫేస్ బుక్ లో తన కామెంట్ ను కూడ పోస్ట్ చేసింది. '' మా పిల్లలకు ఇంతటి ఆదరణ దొరకడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నా పిల్లలకు కూడ మంచి జరగాలని కోరుకుంటున్నాను'' అని కూడ తన భావాలను వ్యక్తం చేసింది. -
రక్త పరీక్షతో.. అకాల మరణాన్ని గుర్తించొచ్చు!
మెల్బోర్న్: ఒక్క రక్త పరీక్షతోనే అకాల మరణానికి గల అవకాశాలను గుర్తించవచ్చని చెబుతున్నారు మెల్బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. 10,000 మంది వ్యక్తుల రక్తనమూనాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ ఫలితాలను గుర్తించారు. మెల్బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 'గ్లిక్-ఏ' అనే మాలిక్యులార్ బై ప్రొడక్ట్‌ను కొత్తగా గుర్తించారు. రక్తంలో గ్లిక్-ఏ పరిమాణం అధికంగా ఉన్న వారిలో రానున్న 14 సంవత్సరాల కాలంలో వివిధ వ్యాదులు, ఇన్ఫెక్షన్ల బారిన పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. ఈ ఇన్ఫెక్షన్లు అకాల మరణానికి దారితీసేంత తీవ్రమైనవిగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. మెల్బోర్న్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త మైకెల్ ఇనోయ్ మాట్లాడుతూ.. ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి ఈ పరిశోదన ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. గ్లిక్-ఏ పై మరింత పరిశోధన జరగాల్సిన అవసంరం ఉందని తెలిపారు. రక్తంలో దీని పరిమాణంను అధిక మోతాదులో గుర్తించినట్లయితే ప్రాణాంతక వ్యాధులకు దగ్గరగా ఉన్నట్లు భావించాల్సి ఉంటుందన్నారు. -
నేడు ప్రిమెచ్యూర్ బేబీస్ డే