
రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ అంతే మొత్తం కొబ్బరి నూనెలో గుడ్డు సొన వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించాలి. మృదువుగా మసాజ్ చేయాలి. ఈ మిశ్రమం వెంట్రుకలకు మంచి కండిషనర్‌లా ఉపయోగపడుతుంది. కుదుళ్లు బలంగా అవుతాయి. దీంతో వెంట్రుక పెరుగుదల బాగుంటుంది.
♦ వెంట్రుకలు చిట్లడం, చుండ్రు సమస్యలు ఉంటే జుట్టు రాలడం కూడా ఎక్కువే ఉంటుంది. ఈ సమస్య నివారణకు కొబ్బరినూనెలో కొన్ని కరివేపాకులు వేసి వేడిచేయాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. రాత్రిపూట ఇలా చేసి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి.
♦ ఆలివ్ ఆయిల్, దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి మాడుకు పట్టించి 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ప్రతి మూడు రోజులకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది.
Comments
Please login to add a commentAdd a comment