
ఆలివ్ ఆయిల్ కేశాల నుంచి, కాలి గోళ్ల వరకు సౌందర్యాన్ని ఇనుమడించడంలో బాగా ఉప యోగపడుతుంది. దీనిని మేకప్ రిమూవ్ చేయడానికి కూడా వాడవచ్చు.ఆలివ్ ఆయిల్ చక్కటి హెయిర్ కండిషనర్‌గా పని చేస్తుంది. ఒక టేబుల్ స్పూను గోరువెచ్చని ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేస్తే పొడిబారిన కేశాలు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. ఏ హెయిర్ స్టయిల్ వేసుకోవాలన్నా సాధ్యమవుతుంది. జుట్టు చక్కగా అమరుతుంది. వారానికి ఒకసారి తలకు ఆయిల్ మసాజ్ చేస్తుంటే కేశాలతోపాటు శరీర ఆరోగ్యం కూడా బాగుంటుంది.ఇది మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది.
శీతా కాలంలో ఆలివ్ ఆయిల్‌ను రోజువారీ వాడకంలో భాగం చేసుకోవచ్చు. ఒక టీ స్పూను ఆయిల్ తీసుకుని అందులో దూదిని ముంచి ముఖాన్ని తుడిస్తే శరీరం విడుదల చేసే టాక్సిన్లతోపాటు బయటి నుంచి పడిన దుమ్ము, ధూళి వంటివి పూర్తిగా తొలగిపోతాయి. సహజమైన మాయిశ్చరైజర్‌గా పని చేసి చర్మాన్ని పొడిబారనివ్వదు. ఒంటిని ఆలివ్ ఆయిల్‌తో మర్దన చేసిన తర్వాత వేడినీటితో స్నానం చేయాలి. గాఢత తక్కువగా ఉన్న సబ్బును మాత్రమే వాడాలి. ఫేషియల్ మసాజ్‌కు వాడే క్రీమ్‌లకు బదులుగా ఆలివ్ ఆయిల్‌ను వాడడం మంచిది. మసాజ్ పూర్తయి ముఖం కడిగిన తర్వాత పన్నీటిలో దూదిని ముంచి ముఖానికి, మెడకు పట్టించి ఆరేవరకు అలాగే ఉంచాలి.
Comments
Please login to add a commentAdd a comment