రెండు–మూడు టేబుల్‌స్పూన్ల ఆలివ్ ఆయిల్‌ను గోరువెచ్చగా చేసి ఒంటికి పట్టించి మర్దన చేసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి.ఒక టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్‌లో ఒక కోడిగుడ్డు సొన, కొద్దిగా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరు వెచ్చటి నీటితో కడగాలి. ఈ ప్యాక్ పొడి చర్మానికి చక్కటి మాయిశ్చరైజర్. పొడి చర్మం కలిగిన వారయితే వారానికి కనీసం నాలుగుసార్లు, సాధారణ చర్మానికయితే వారానికి ఒకటి– రెండు సార్లు ఈ ప్యాక్ వేస్తే పగుళ్లు రాకుండా చర్మం మృదువుగా ఉంటుంది. కొన్ని రకాల ప్యాక్‌లు, చర్మం మీద గాయాలున్నప్పుడు మినహాయించాల్సి ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌లోని చర్మరక్షణ గుణాలు చిన్నచిన్న గాయాలను, చర్మ సమస్యలను కూడా తగ్గిస్తాయి కాబట్టి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.
మస్కారా పొడిబారినట్లయితే అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేస్తే తిరిగి మామూలుగా వస్తుంది.రెండు టీ స్పూన్ల చక్కెరలో అంతే మోతాదులో ఆలివ్ ఆయిల్ కలిపి చేతులకు పట్టించి రుద్దినట్లయితే మృతకణాలు తొలగిపోవడంతోపాటు మృదువుగా మారి చర్మం మెరుస్తుంది.అరకప్పు ఆలివ్ ఆయిల్‌లో పావుకప్పు వెనిగర్, పావుకప్పు నీటిని కలిపి రాత్రి పడుకునే ముందు ముఖం, మెడ, చేతులకు పట్టిస్తే నిర్జీవంగా ఉన్న చర్మం కాస్తా ఉదయానికి కాంతులీనుతుంది. ఈ మిశ్రమాన్ని ఒకసారి తయారుచేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకుని నాలుగైదు రోజులపాటు వాడుకోవచ్చు. మిశ్రమాన్ని పట్టించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి.
ఆలివ్ ఆయిల్‌తో లవ్లీ స్కిన్
Published Wed, May 9 2018 12:27 AM | Last Updated on Wed, May 9 2018 12:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment