న్యూయార్క్ : మధుమేహానికి ఆలివ్‌నూనె వాడటం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అందులో ఉండే ‘ఒలెరోపిన్’ సమ్మేళనం ఎక్కువ ఇన్సులిన్ స్రవించేలా శరీరానికి సాయం చేసి, మధుమేహాన్ని అడ్డుకుట్టుందని అమెరికాలోని వర్జీనియా పాలిటెక్నిక్ ఇనిస్టిట్యూట్ అండ్ స్టేట్ యూనివర్సిటీ (వర్జీనియా టెక్) పరిశోధకులు తెలిపారు. ఆలివ్‌నూనెలో ఉండే ఆయుర్వేద గుణాలు రోగ క్రిమినాశకంగా పనిచేస్తాయని వెల్లడించారు. అలాగే వందలాది ఏళ్ల నుంచి మధ్యధరా సముద్ర తీర ప్రాంతాల్లో ఆలివ్ నూనెను వంటల్లో వినియోగిస్తున్నారు. వంటల్లో ఆలివ్ నూనెను ఉపయోగించడం వల్ల చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది.
అలాగే సౌందర్య సాధనంగా ఆలివ్ ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. మరో సింపుల్ టిప్ ఏంటంటే... రాత్రి పడుకునేముందు అరటిపండు గుజ్జులో ఆలివ్ ఆయిల్ కలిపి, ముఖానికి మసాజ్ చేసుకుంటే ముడతలు రావు.
Comments
Please login to add a commentAdd a comment