ముడతల నివారణకు... వ్యాయామం
ఫేస్ ఎక్సర్‌సైజ్
వేడి, చలి, దుమ్ము.. ఈ కారణాల వల్ల చర్మం పొడిబారుతుంటుంది. పొడి చర్మం త్వరగా ముడతలు పడే అవకాశం ఉంది. రక్తప్రసరణ మెరుగై, చర్మకణాలు చురుకుదనం నింపుకోవాలంటే ముఖకండరాలకు వ్యాయామం అవసరం. బిగువు కోల్పోకుండా, చర్మం ముడతలు పడకుండా ఉండటానికి ఈ ‘ఫేసియల్ ఎక్సర్‌సైజ్’లు ఎంతగానో ఉపకరిస్తాయి. పై పెదవి, కింద పెదవి లోపలికి మడచి, బుగ్గల నిండుగా గాలి తీసుకోవాలి.
రెండు చూపుడు వేళ్లతో పెదవుల చివర్లను పట్టుకొని, సాగదీసి, తర్వాత వదిలేయండి. ఇలా 5-6 సార్లు చేయాలి.
కనుబొమ్మలను పైకి లేపుతూ, నుదురు భాగపు చర్మాన్ని సాధ్యమైనంత వరకు సాగదీసి, వదిలేయాలి. ఇలా 5-6 సార్లు, రోజులో ఉదయం, పగలు, సాయంత్రం చేయవచ్చు.
రాత్రి పడుకునేముందు అరటిపండు గుజ్జులో ఆలివ్ ఆయిల్ కలిపి, ముఖానికి మసాజ్ చేసుకోవాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే ముడతలు రావు.