face exercise
-
డబుల్ చిన్తో పెద్దవాళ్లలా కనిపిస్తున్నారా? ఇలా చేస్తే అందంగా, నాజుగ్గా..
ముఖం నాజుగ్గా ఉంటే.. ఏ వయసు వారైనా సరే.. అందంగా కనిపిస్తారు. నలుగురిలో ప్రత్యేకంగా అగుపిస్తారు. సాధారణంగా చాలా మందికి.. వయసు పెరిగే కొద్దీ డబుల్ చిన్ ఏర్పడి.. చెంపల చుట్టూ కొవ్వు పేరుకుని.. రుపురేఖలు మారిపోతాయి. అలాంటి వారికి ఈ ఫేషియల్ స్లిమ్మింగ్ ఎక్సర్సైజర్ చక్కటి పరిష్కారాన్ని చూపిస్తోంది. ఈ టూల్‌ని పళ్ల మధ్య కరిచిపెట్టుకుని.. నములుతున్నట్లుగా బాగా కదిలించాలి. అలా చేయడం వల్ల ముఖం, మెడ, గెడ్డం వంటి భాగాల్లో పేరుకున్న కొవ్వు పూర్తిగా తగ్గి.. అందమైన షేప్ వస్తుంది. దీనికోసం ఉపయోగించిన ఫుడ్–గ్రేడ్ మెటీరియల్.. హీట్–రెసిస్టెంట్ సిలికాన్ కావడంతో ఎలాంటి హానీ కలుగదు. ఈ స్లిమ్మర్.. ముఖంలో పేరుకున్న కొవ్వుని ఇట్టే కరిగిస్తుంది. రన్నింగ్, వాకింగ్, జిమ్ వంటివి చేస్తున్న సమయాల్లో కానీ.. ల్యాప్‌టాప్‌లో పని చేసుకుంటూ కానీ, టీవీ చూస్తూ కానీ ఎప్పుడైనా ఈ టూల్‌ని నోట కరిచి.. ఫేస్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సుమారు నెల పాటు క్రమం తప్పకుండా రోజుకి మూడు నుంచి పది నిమిషాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని ఉపయోగించే ముందు 30 సెకన్ల పాటు గోరువెచ్చని నీటిలో వేసి క్లీన్ చేసిన తర్వాతే నోట్లో పెట్టుకోవాలి. ముందుగా దవడలకు ఇరువైపులా పెట్టుకుని.. తర్వాత.. ముందుపళ్ల మధ్య పెట్టుకుని వ్యాయామం చెయ్యాలి. అలా చేయడంతో ముఖంలోని కండరాలు కదిలి.. ఫేస్ ’V’ షేప్‌లోకి మారుతుంది. డబుల్ చిన్ పూర్తిగా తగ్గుతుంది. ఇక ఈ టూల్ వాడటం పూర్తి అయ్యాక.. చల్లటి నీళ్లతో దాన్ని క్లీన్ చేసి దాచిపెట్టుకోవాలి. ఈ ఎక్సర్సైజర్తో ఒక ప్రత్యేకమైన తాడు కూడా లభిస్తుంది. దాన్ని ఉపయోగించి.. జిమ్‌కి వెళ్లే సమయాల్లో ఈ టూల్‌ని మెడలో వేసుకుని వెంట తీసుకెళ్లొచ్చు. -
మేకప్‌తో దాచేసినా ఇబ్బంది తప్పదు.. ఈ చిట్కాలు పాటిస్తే బెటర్!
వయసు పెరిగేకొద్దీ శరీరంలో వచ్చే మార్పులు ఒక్కోసారి ఆందోళన కలిగిస్తాయి. వాటిల్లో అధిక బరువు ఒకటి. దీంతో నలుగురిలోకి రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా ముఖంపై పేరుకుపోయిన కొవ్వు వల్ల కనిపించే ముడతలు, డబుల్ చిన్, ఉబ్బిన బుగ్గలు, మెడపై కొవ్వు మరింతగా బాధిస్తాయి. మేకప్‌తో కొంత దాచేసినా అది కేవలం తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తుంది. అయితే మన లైఫ్స్టైల్లో కొద్దిపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చంటున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్. అవేంటో తెలుసుకుందామా.. నీరు ఎక్కువగా తాగాలి మీరు అధిక బరువు లేకపోయినప్పటికీ, డీహైడ్రేషన్ కారణంగా ముఖం ఉబ్బినట్టు కనిపించవచ్చు. శరీరానికి ఎప్పుడైతే తగినంతగా నీరు అందదో అప్పుడు శరీరంలో లవణాల స్థాయులు స్థిరంగా నిలిచిపోతాయి. ఫలితంగా మీ శరీరం ముఖ్యంగా ముఖం ఉబ్బినట్టు కనిపిస్తుంది. ప్రతి రోజు 8 గ్లాసుల నీరు తాగడం వల్ల జీవక్రియ క్రమపద్ధతిలో ఉండటమే కాకుండా మీ ముఖం కోమలంగా ఉండేలా సహాయపడుతుంది. అంతేకాకుండా మీ శరీరంలోని కొవ్వులు వేగంగా కరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రోజుకు ఎంత పరిమాణంలో నీరు తాగుతున్నారో గమనించుకోండి. (చదవండి: ట్రీట్మెంట్ నిలిపివేసిన ఆస్పత్రులు.. అదే జరిగితే ఉద్యోగాలు వదిలేస్తామని లక్షల మంది బెదిరింపు!) ఉప్పు తక్కువగా తీసుకుంటే బెటర్ అనేక ఆరోగ్య సమస్యలకు అధిక ఉప్పు ప్రత్యక్ష కారణమని మనందరికీ తెలిసిందే! అయితే ఆహారంలో ఉప్పు అధికమోతాదులో తీసుకోవడం ద్వారా బరువు వేగంగా పెరుగుతారని మీకు తెలుసా? ఒక్కోసారి కేవలం ఒక్కరోజులోనే బరువుపెరిగినట్టుగా కూడా అనిపిస్తుంది. ముఖం బొద్దుగా, వాచిపోయినట్టుగా కూడా కనిపించే అవకాశం ఉంది. కాబట్టి తినే, తాగే పదార్థాల్లో ఉప్పు మితంగా ఉంటే వివిధ మార్గాల్లో వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇతర అనారోగ్య సమస్యలను కూడా దరిచేరకుండా నివారించవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తినండి బరువు తగ్గే ప్రక్రియలో.. తినే ఆహారంపై కూడా తప్పనిసరిగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. స్థూల, సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే ఆరోగ్య ఆహారపు అలవాట్లు శరీర అంతర్గత వ్యవస్థ మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి సహాయపడతాయి. ఇది మీ జీవక్రియను వేగవంతం చేయడం వల్ల శరీరంలోని అనవసరపు కొవ్వు వేగంగా కరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కోరుకున్న రీతుల్లో మీ శరీరాకృతిని తీర్చిదిద్దుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నమాట. (చదవండి: నటికి అరెస్ట్ వారెంట్ జారీ చేసిన పాకిస్తాన్ ప్రభుత్వం) తగినంతగా నిద్రకూడా అవసరమే బరువును తగ్గించడానికి, ముఖం స్లిమ్‌గా కనిపించడానికి తగినంత నిద్ర కూడా అవసరమే. సమయానికి నిద్ర పోవాలి. కనీసం 7 నుంచి 8 గంటల పాటైనా విశ్రాంతి తీసుకోవాలి. నిద్రలేమి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మీ జీవక్రియ (మెటబాలిజం)ను తలక్రిందులు చేయడమేకాక, కొవ్వు మోతాదులను పెంచుతుంది. మరునాటికల్లా మీ ముఖాకృతిలో మార్పులు తీసుకొస్తుంది. ఫేషియల్ ఎక్సర్సైజెస్ శరీరంలోని వివిధ అవయవాలతో ఎక్సర్సైజ్లు చేసినట్టే, ఫేషియల్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. ముఖ కండరాలను బలపరిచి, వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా చేయడంలో ముఖ వ్యాయామాలు సహాయపడతాయని జర్నల్ ఆఫ్ క్లినికల్ అండ్ డయాగ్నోస్టిక్ పరిశోధనాధ్యనాలు వెల్లడించాయి. బరువు తగ్గడానికి ముఖ వ్యాయామాలు ఎంతవరకు ఉపయోగపడతాయో స్పష్టతలేదు కానీ, ముఖం పల్చగా కనిపించడానికి మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుందనేది నిపుణుల మాట. -
ముడతల నివారణకు... వ్యాయామం
ఫేస్ ఎక్సర్సైజ్ వేడి, చలి, దుమ్ము.. ఈ కారణాల వల్ల చర్మం పొడిబారుతుంటుంది. పొడి చర్మం త్వరగా ముడతలు పడే అవకాశం ఉంది. రక్తప్రసరణ మెరుగై, చర్మకణాలు చురుకుదనం నింపుకోవాలంటే ముఖకండరాలకు వ్యాయామం అవసరం. బిగువు కోల్పోకుండా, చర్మం ముడతలు పడకుండా ఉండటానికి ఈ ‘ఫేసియల్ ఎక్సర్సైజ్’లు ఎంతగానో ఉపకరిస్తాయి. పై పెదవి, కింద పెదవి లోపలికి మడచి, బుగ్గల నిండుగా గాలి తీసుకోవాలి. రెండు చూపుడు వేళ్లతో పెదవుల చివర్లను పట్టుకొని, సాగదీసి, తర్వాత వదిలేయండి. ఇలా 5-6 సార్లు చేయాలి. కనుబొమ్మలను పైకి లేపుతూ, నుదురు భాగపు చర్మాన్ని సాధ్యమైనంత వరకు సాగదీసి, వదిలేయాలి. ఇలా 5-6 సార్లు, రోజులో ఉదయం, పగలు, సాయంత్రం చేయవచ్చు. రాత్రి పడుకునేముందు అరటిపండు గుజ్జులో ఆలివ్ ఆయిల్ కలిపి, ముఖానికి మసాజ్ చేసుకోవాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే ముడతలు రావు.