కాఫీ పొడితో ముఖకాంతి
కప్పు కాఫీ తాగితే వెంటనే రిఫ్రెష్ అయిపోతారు. అలాగే కాఫీ పొడిని చర్మంపై మలినాలను తొలగించడానికి వాడితే చర్మకాంతి పెరుగుతుంది. కాఫీ గింజలలో ప్రకృతి సిద్ధ గుణాలు ఉంటాయి. వీటిలో ఉండే కెఫిక్ యాసిడ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల ప్రభావంతో చర్మకణాలు ఉత్తేజం పొందుతాయి. ఫలితంగా చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు సులువుగా వదిలిపోతాయి.
టేబుల్‌స్పూన్ కాఫీ పొడిని టేబుల్‌స్పూన్ నీళ్లు లేదా ఆలివ్ ఆయిల్‌లో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు రాసి, మృదువుగా రుద్దాలి. కాఫీలోని గుణాలు మలినాలను తొలగిస్తే ఆలివ్ ఆయిల్‌లోని గుణాలు చర్మానికి మాయిశ్చరైజర్‌ను కలిగిస్తాయి. ఫలితంగా ఎండవల్ల కమిలిన చర్మం సాధారణ రంగులోకి వస్తుంది. చర్మం మృదువుగా అవుతుంది.