thickness
-
రోజూ ఇలా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి
కొంతమందికి కనుబొమలు బాగా పలుచగా, ఉండీ లేనట్టుగా కనిపిస్తాయి. కనుబొమలు తీరైన ఆకృతితో, దట్టంగా ఉంటేనే ముఖారవిందం ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పలుచని కనుబొమ్మలను ఒత్తుగా... నల్లగా మార్చుకోవడానికి ఇలా ప్రయత్నించి చూడండి... ఆముదం: జట్టు పెరుగుదలకు దోహదపడే వాటిలో ఆముదం ముందు వరుసలో ఉంటుంది. దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, విటమిన్ ఇ, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. దూదిని ఆముదంలో ముంచి పలుచని ఐబ్రోస్ మీద అద్దుకుని ఐదు నిమిషాలు మర్దన చేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. ఉల్లిపాయ రసం: ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఉల్లిపాయ రసాన్ని రోజూ కనుబొమలకు రాసుకోవాలి. రెండు మూడు వారాల్లోనే చక్కని ఫలితం కనిపిస్తుంది. ఆలివ్ ఆయిల్ : ఫీనాలిక్ కాంపౌండ్స్ ఉండే ఆలివ్ నూనెను కనుబొమ్మలకు రాస్తే .. వెంట్రుకలు నల్లగా పెరుగుతాయి. -
'బ్యాట్ మందం అనేది సమస్యే కాదు'
లక్నో: ఇప్పటికే క్రికెటర్లు వాడే బ్యాట్ల మందంపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసిన వరల్డ్ క్రికెట్ కమిటీ మెరిల్ బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) పలు మార్గదర్శకత్వాలను సూచించగా, భారత్ లో బ్యాట్లను తయారు చేసేవారు మాత్రం ఆ సూచనలతో ఏకీభవించడం లేదు. బ్యాట్ల మందంపై నిబంధనల వల్ల ఉపయోగం ఉండదు. బ్యాట్ బ్యాలెన్స్ తో పాటు, ఆటగాళ్ల టాలెంట్ ఇక్కడ ముఖ్యం' అని ఎంతోమంది స్టార్ ఆటగాళ్లకు బ్యాట్లను తయారు చేసిన ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీడీఎమ్ ఫ్యాక్టరీ వర్కర్ జితేందర్ సింగ్ పేర్కొన్నాడు. క్రికెటర్ల సూచనమేరకు మందంగా ఉన్న బ్యాట్లను కానీ, పలుచని బ్లేడ్ తరహా బ్యాట్లను కానీ తాము తయారు చేస్తూ ఉంటామన్నాడు. ఆయా బ్యాట్లను బ్యాట్స్మెన్ ఎలా ఉపయోగించాలో ఆ క్రికెటర్ల నైపుణ్యంపై మాత్రమే ఆధారపడి వుంటుంది తప్ప బ్యాట్ తయారీపై కాదన్నాడు. గతనెల్లో క్రికెటర్ల వాడే బ్యాట్ల మందం పరిమితంగా ఉండాలంటూ ఎంసీసీ సూచించిన సంగతి తెలిసిందే. ఆటగాళ్లు సిక్సర్లు, ఫోర్లను సులువుగా కొట్టడానికి బ్యాట్ల మందం పెరగడం కూడా కారణమని ఎంసీసీ అభిప్రాయపడింది.