చలికాలం చర్మం పొడిబారి, జీవం కోల్పోయినట్టు కనపడుతుంది. ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కలిగి ఉండాలి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందుకు సంబంధించి కొన్ని టిప్స్ మీకోసం.
టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు, పాదాలకు రాసి మసాజ్ చేయాలి.
స్నానం చేసేముందు నాలుగు చుక్కల బాదం నూనె బకెట్ నీటిలో కలపాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది.
అరటిపండు గుజ్జు, కప్పు పెరుగు, టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ ఓట్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మేనికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీంతో చర్మానికి జీవకళ వస్తుంది.
స్నానం చేయడానికి అరగంట ముందు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె మేనికి రాసుకోవాలి. మృదువుగా మర్దనా చేసి, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి
చలికాలం నూనె శాతం అధికంగా ఉన్న మాయిశ్చరైజర్లు వాడాలి. ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్‌గా ఉపయోగించవచ్చు.
టీ స్పూన్ శనగపిండిలో అర టీ స్పూన్ తేనె, పచ్చిపాలు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పొడిబారిన ముఖ చర్మం ముడతలు తగ్గుతాయి.
చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. అలాగని చర్మాన్ని మరీ రబ్ చేయకూడదు. కార్న్‌ఫ్లేక్స్‌ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి, మర్దనా చేయాలి. మృతకణాలు తొలగి పోయి చర్మం మృదువుగా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment