సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు మరింత పడిపోతున్నాయి. వికారాబాద్ జిల్లా మోమీన్‌పేట్, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో ఆదివారం రాత్రి అతి తక్కువగా 8.4 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. అలాగే సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో 8.5, ఆదిలాబాద్ జిల్లా బేల, కామారెడ్డి జిల్లా మధ్నూర్, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 8.6 డిగ్రీల చొప్పున రికార్డయింది. రాష్ట్రవ్యాప్తంగా 20కిపైగా మండలాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
ఇక వివిధ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌లో ఆదివారం రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 9.8 డిగ్రీ సెల్సియస్‌గా నమోదుకాగా.. హైదరాబాద్‌లో 13.6 డిగ్రీలు, నిజామాబాద్‌లో 14.4 డిగ్రీలు, దుండిగల్‌లో 14.6 డిగ్రీలు, మెదక్‌లో 14.8 డిగ్రీల చొప్పున రికార్డయింది. మెదక్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్రంలో మరో రెండ్రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతల్లో భారీ తగ్గుదల ఉంటుందని, సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment