
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు. ఈ విషయం విన్న తర్వాత అది నిజమే అనిపిస్తుంది. అసలే చలికాలం మొదలైంది కాబట్టి రానున్న మూడు నెలలు చలి తీవ్రంగా ఉండబోతుంది. ఇప్పటికే ప్రతీ ఇంట్లో చలి నుంచి తప్పించుకోవడానికి రకరకాల స్వెటర్లు, ఇంకా అనేక దుస్తులను రెడీ చేసుకుంటారు. అయితే మనం తీసుకునే ఆహారంలో ఉల్లిగడ్డను తీసుకోవడం ద్వారా ఎంతటి చలిలోనైనా శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవచ్చవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతీ వంటింట్లో ఉల్లి లేనిదే ఏ కూరను వండరన్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఉల్లిలో ఉండే ఎంజైమ్స్, కొన్ని యంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన శరీరాన్ని ఎప్పటికప్పుడు వెచ్చగా ఉంచుతుందట. అందుకే చలికాలంలో రోజుకు ఒక ఉల్లి తింటే ఎంత చలికి తటుకొనైనా ఉండవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
ఉల్లిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఒక్కసారి పరిశీలిద్దాం.
- ఉల్లిని జ్యూస్‌గా తీసుకోవడం వల్ల మన శరీరంలో వెచ్చదనాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు అప్పటికప్పుడు తగినంత శక్తిని ఇస్తుందట.
- ఉల్లిలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్స్, రసాయన పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. దీని వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి
- ఉల్లిలో సహజంగానే అల్లైల్ డై సల్ఫేట్, యాంటీ సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ వంటి లక్షణాలు ఉంటాయి. వీటి వల్ల జ్వరం, జలుబు, దగ్గు, ఉబ్బసం, చెవి, చర్మ సమస్యలను తగ్గించడంలో ఉల్లిపాయలు ప్రయోజనకరంగా ఉంటాయి.
- చలికాలంలో సాధారణంగానే వ్యాయామం చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. కాబట్టి రోజు ఒక ఉల్లి తింటే బరువు పెరగకుండా ఉంచేందుకు దోహదపడుతుంది. ఉల్లిలో ఉండే కాల్షియం, ఐరన్, ఫోలేట్, సల్ఫర్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు, ఎక్కువ మోతాదులో ఉండే ఫైబర్ మనిషిని బరువు పెరగకుండా ఉంచుతుందట.
- చలికాలంలో తీపి వస్తువులు, కూల్ డ్రింక్స్‌ను ఎక్కువగా తీసుకున్నప్పుడు మన చిగుళ్లు చెడిపోయే అవకాశం ఉంది. అయితే రోజు ఉల్లిని తింటే పిప్పి పళ్లను రాకుండా చేయడంతో పాటు చిగుళ్లను మరింత బలంగా తయారు చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment