
శీతాకాల చల్లదనం నుంచి రక్షణ కల్పించే ప్రత్యేక దుస్తుల కలెక్షన్‌ను డాలర్ ఇండస్ట్రీస్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. డాలర్ అల్ట్రా థర్మల్ పేరుతో 100 శాతం సూపర్ కాంబ్ సిరో క్లీన్ కాటన్ నూలుతో రూపొందించిన దుస్తులను విడుదలచేసింది. త్వరగా తడి ఆరిపోతా యని తెలిపింది. వీటి ధరల శ్రేణి రూ.300 నుంచి రూ.500 వరకు ఉన్నాయి. చలి సంబంధిత ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటివి రాకుండా ఉండే విధంగా ఈ దుస్తులను రూపొందించినట్లు కంపెనీ ఎండీ వినోద్ కుమార్ గుప్తా చెప్పారు.
అరబిందో: యూఎస్ అనుబంధ కంపెనీ అరో వ్యాక్సిన్స్.. క్లినికల్ దశ వ్యాక్సిన్ల అభివృద్ధిలో ఉన్న యూఎస్ కంపెనీ ప్రోఫెక్టస్ బయోసైన్సెస్‌తో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా ప్రోఫెక్టస్‌కు చెందిన కొన్ని వ్యాపార ఆస్తులను అరో వ్యాక్సిన్స్ దక్కించుకోనుంది. డీల్ విలువ సుమారు రూ.80 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment