Dollar Industries
-
12 శాతం వృద్ధి లక్ష్యం: డాలర్ ఇండస్ట్రీస్
హైదరాబాద్ , బిజినెస్ బ్యూరో: డాలర్ ఇండస్ట్రీస్ 2024–25లో 12% ఆదాయ వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. 2023–24లో కంపెనీ రూ.506 కోట్ల టర్నోవర్‌పై రూ.90 కోట్ల నికరలాభం ఆర్జించింది. సంస్థ అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 8 శాతంగా ఉందని ఎండీ వినోద్ కుమార్ గుప్తా మీడియాకు తెలిపారు. ‘సంస్థ మొత్తం అమ్మకాల్లో దక్షిణాది వాటాను 20 శాతానికి చేరుస్తాం. ఈ ప్రాంతంలో మూడేళ్లలో 50 ఔట్లెట్లను తెరుస్తాం’ అని అన్నారు. 2025 –26లో రూ.2,000 కోట్ల టర్నోవర్ సాధిస్తామని జేఎండీ బినయ్ కుమార్ గుప్తా తెలిపారు. బ్రాండెడ్ హొజైరీ రంగంలో కంపెనీ మార్కెట్ వాటా 15 శాతం. -
‘డాలర్’ థర్మల్ కలెక్షన్
శీతాకాల చల్లదనం నుంచి రక్షణ కల్పించే ప్రత్యేక దుస్తుల కలెక్షన్‌ను డాలర్ ఇండస్ట్రీస్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. డాలర్ అల్ట్రా థర్మల్ పేరుతో 100 శాతం సూపర్ కాంబ్ సిరో క్లీన్ కాటన్ నూలుతో రూపొందించిన దుస్తులను విడుదలచేసింది. త్వరగా తడి ఆరిపోతా యని తెలిపింది. వీటి ధరల శ్రేణి రూ.300 నుంచి రూ.500 వరకు ఉన్నాయి. చలి సంబంధిత ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటివి రాకుండా ఉండే విధంగా ఈ దుస్తులను రూపొందించినట్లు కంపెనీ ఎండీ వినోద్ కుమార్ గుప్తా చెప్పారు. అరబిందో: యూఎస్ అనుబంధ కంపెనీ అరో వ్యాక్సిన్స్.. క్లినికల్ దశ వ్యాక్సిన్ల అభివృద్ధిలో ఉన్న యూఎస్ కంపెనీ ప్రోఫెక్టస్ బయోసైన్సెస్‌తో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా ప్రోఫెక్టస్కు చెందిన కొన్ని వ్యాపార ఆస్తులను అరో వ్యాక్సిన్స్ దక్కించుకోనుంది. డీల్ విలువ సుమారు రూ.80 కోట్లు. -
‘డాలర్ బిగ్‌బాస్’ ఫెస్టివ్ కలెక్షన్
కోల్‌కతా: దేశీ ప్రముఖ హోజరీ బ్రాండ్ ‘డాలర్ ఇండస్ట్రీస్’ తాజాగా పండుగ సీజన్‌ను పురస్కరించుకొని తన వినియోగదారుల కోసం ‘డాలర్ బిగ్‌బాస్’ ఫెస్టివ్ కలెక్షన్‌ను ఆవిష్కరించింది. ఇందులో ప్రింటెడ్ ట్రంక్, ఫైన్ వెస్ట్స్, కాటన్ బ్రీఫ్స్, ప్రీమియం జిమ్ వెస్ట్స్ వంటి పలు ప్రొడక్ట్స్ ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. కస్టమర్ల క్వాలిటీ, కంఫర్ట్‌లను దృష్టిలో ఉంచుకొని ఈ కలెక్షన్‌ను రూపొందించామని డాలర్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ వినోద్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. వినియోగదారులకు తాజా ప్రొడక్ట్స్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని మల్టీ బ్రాండెడ్ ఔట్‌లెట్లలోనూ, ఈ-కామర్స్ పోర్టళ్లలోనూ అందుబాటులో ఉంటాయని తెలిపారు. -
రూ.1,000 కోట్ల టర్నోవర్ లక్ష్యం: డాలర్ ఇండస్ట్రీస్
హైదరాబాద్: నిట్వేర్ తయారీ కంపెనీ డాలర్ ఇండస్ట్రీస్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 35 శాతం వృద్ధి చెంది రూ.26 కోట్లకు పెరిగింది. రూ.830 కోట్ల టర్నోవర్ సాధించామని డాలర్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్ల టర్నోవర్ సాధించడం లక్ష్యమని డాలర్ ఇండస్ట్రీస్ ఎండీ, వినోద్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఆరేళ్లలో మంచి వృద్ధి సాధించడానికి తమ బ్రాండ్ అంబాసిడర్ అక్షయ్‌కుమార్ కీలక పాత్ర పోషించారని, ఆయన వల్ల డాలర్ బ్రాండ్‌కు మంచి గుర్తింపు వచ్చిందని వివరించారు. భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తమ కంపెనీ వందలాది ఉద్యోగాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. ఆరేళ్ల పాటు డాలర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగడం సంతోషంగా ఉందని బ్రాండ్ అంబాసిడర్ అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించారు. -
డాలర్ ఇండస్ట్రీస్ నుంచి మెన్ ఇన్నర్‌వేర్ బ్రాండ్..‘ఫోర్స్ నెక్ట్స్’
బెంగళూరు: హోజరీ దిగ్గజం ‘డాలర్ ఇండస్ట్రీస్’ తాజాగా పురుషుల కోసం కొత్తగా ప్రీమియం ఇన్నర్‌వేర్ బ్రాండ్ ‘ఫోర్స్ నెక్ట్స్’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఫోర్స్ నెక్ట్స్ బ్రాండ్ ఫైన్జ్, రిలాక్స్జ్, ఫ్లెక్స్జ్ అనే మూడు కేటగిరిల్లో లభ్యమవుతుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఫ్యాషన్‌ను అనుసరించే యువతను దృష్టిలో ఉంచుకొని ఫోర్స్ నెక్ట్స్ రూపకల్పన జరిగిందని, దీన్ని 2016-17 నాటికి రూ.100 కోట్ల బ్రాండ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సంస్థ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ బినయ్ కుమార్ గుప్తా తెలిపారు. తమ కొత్త బ్రాండ్ ప్రముఖ హోజరీ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, మాల్స్‌తోపాటు ఈ-కామర్స్ సంస్థల్లోనూ వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. -
డాలర్ ఇండస్ట్రీస్ ‘ఫోర్స్ ఎన్ఎక్స్టీ’ బ్రాండ్
హైదరాబాద్: ప్రముఖ హొజైరీ కంపెనీ డాలర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పురుషుల కోసం ప్రత్యేకించి యువతను ఉద్దేశించి ‘ఫోర్స్ ఎన్ఎక్స్టీ’ అనే కొత్త ఇన్నర్‌వేర్ బ్రాండ్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. బ్రాండ్ ఉత్పత్తులు పలు రకాల రంగుల్లో ట్రెండీగా, ఫ్యాషనబుల్‌గా ఉంటాయని డాలర్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డెరైక్టర్ వినోద్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. ఫోర్స్ ఎన్ఎక్స్టీ బ్రాండ్ ఉత్పత్తులు ఫైన్జ్, రిలాక్జ్, ఫ్లెక్జ్ అనే మూడు కేటగిరిల్లో లభ్యమవుతాయని పేర్కొన్నారు. ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ ఐరన్ మ్యాన్‌గా పేరున్న మిలింద్ సోమన్ ఈ ఫోర్స్ ఎన్ఎక్స్టీ బ్రాండ్ లోగోను ఆవిష్కరించారు.