హైదరాబాద్ , బిజినెస్ బ్యూరో: డాలర్ ఇండస్ట్రీస్ 2024–25లో 12% ఆదాయ వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. 2023–24లో కంపెనీ రూ.506 కోట్ల టర్నోవర్‌పై రూ.90 కోట్ల నికరలాభం ఆర్జించింది. సంస్థ అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 8 శాతంగా ఉందని ఎండీ వినోద్ కుమార్ గుప్తా మీడియాకు తెలిపారు.
‘సంస్థ మొత్తం అమ్మకాల్లో దక్షిణాది వాటాను 20 శాతానికి చేరుస్తాం. ఈ ప్రాంతంలో మూడేళ్లలో 50 ఔట్‌లెట్లను తెరుస్తాం’ అని అన్నారు. 2025 –26లో రూ.2,000 కోట్ల టర్నోవర్ సాధిస్తామని జేఎండీ బినయ్ కుమార్ గుప్తా తెలిపారు. బ్రాండెడ్ హొజైరీ రంగంలో కంపెనీ మార్కెట్ వాటా 15 శాతం.
Comments
Please login to add a commentAdd a comment