
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు బలంగా వీస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరుగుతున్నట్టు వివరించింది. రానున్న రెండ్రోజులు ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని సూచించింది. ఆదివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 6.7 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సోమ, మంగళవారాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.