Minimum temperature
-
కోహీర్ గజగజ
యెర్భల్ శ్రీనివాస్‌రెడ్డి / జహీరాబాద్: అక్కడ ఉదయం తొమ్మిది అయినా ఎక్కడా జనం కనిపించరు.. సాయంత్రం ఆరు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యం.. ఉదయం, రాత్రే కాదు.. మధ్యాహ్నం పూట కూడా స్వెట్టర్లు వేసుకోనిదే బయటికి వెళ్లలేని పరిస్థితి. ఇది ఎక్కడో మంచు ప్రాంతాల్లోనో, పర్వతాలున్న చోటనో కాదు.. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండల కేంద్రంలో పరిస్థితి ఇది. ఏటా చలికాలం వచ్చిందంటే ఇక్కడి జనం గజగజ వణికిపోతుంటారు.ఆ ప్రాంతంలోని నేలలు.. చుట్టూరా పచ్చదనం.. చెరువులు, ఇతర జల వనరులు గణనీయంగా ఉండటం వంటివి ఈ పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతున్నారు. కోహీర్ గ్రామ శివార్లలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీజీడీపీఎస్) ఆధ్వర్యంలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి.. వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు.నల్లరేగడి నేలలు, పెద్ద సంఖ్యలో చెట్లతో..కోహీర్ గ్రామ పరిధిలో 7 వేల ఎకరాల మేర వ్యవసాయ భూములు ఉన్నాయి. అందులో 5 వేల ఎకరాల మేర నల్ల రేగడి భూములు, 500 ఎకరాలు పడావ్పడ్డ భూములున్నాయి. ఈ నేలల్లో నీటి నిల్వ మిగతా వాటితో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. ఇక గ్రామం చుట్టూరా పెద్ద సంఖ్యలో చెట్లు ఉన్నాయి. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోటిగార్పల్లిలో 1,500 ఎకరాల్లో, బడంపేట, పర్శపల్లిలో వెయ్యి ఎకరాల చొప్పున అడవులు ఉన్నాయి. గోటిగార్పల్లికి సరిహద్దుగా ఉన్న కర్ణాటకలోని కుంచవరం, బోనస్పూర్, శివరాంపూర్ ప్రాంతాల్లో సుమారు 5 వేల ఎకరాలకుపైగా అడవి ఉంది.చుట్టూ నీటి వనరులే..కోహీర్కు ఎగువన ఐదు కిలోమీటర్ల దూరంలోని బడంపేటలో రెండు చెరువులు, పక్కనే ఉన్న గొటిగార్‌పల్లిలో 1,100 ఎకరాలకు నీరందించే పెద్దవాగు ప్రాజెక్టు ఉంది. 6 కిలోమీటర్ల దూరంలోని పర్శపల్లిలో తైదల, రాముని చెరువులు ఉన్నాయి. రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పైడిగుమ్మల్లో మైసమ్మ చెరువు, నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సజ్జాపూర్‌లో చిన్న చెరువు ఉంది. కోహీర్‌లో భూగర్భ జలమట్టం 10 అడుగులలోపే. పలుచోట్ల బావుల్లో నీళ్లు బిందెలతో ముంచుకునేంత పైవరకు ఉంటాయి. కొన్ని బోర్లలో నుంచి నీళ్లు పైకి ఉబికి వస్తుంటాయి. దీనికితోడు కోహీర్ ప్రాంతం సముద్ర మట్టానికి 629 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ అంశాలన్నీ కలసి ఇక్కడ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. రెండేళ్ల కింద 6.2 డిగ్రీలకు.. కోహీర్ ప్రాంతంలో 2022 సంవత్సరంలో 6.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గత ఏడాది 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈసారి చలికాలం ప్రారంభంలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల వరకు తగ్గాయి. ఈ నెల 19న 9.5 డిగ్రీలు, 20న 9.0 డిగ్రీలు, 21న 12 డిగ్రీలు, 22న 10.9 డిగ్రీలు, 23న 10.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక డిసెంబర్, జనవరిలలో ఉష్ణోగ్రతలు ఇంకెంత తగ్గుతాయోనని స్థానికులు పేర్కొంటున్నారు.ఐదింటికే ఇంటి ముఖం చలి తీవ్రత అధికంగా ఉండటంతో కోహీర్‌లో రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర పనులకు వెళ్లేవారు సాయంత్రం ఐదు గంటలకే ఇళ్లకు తిరిగి వస్తున్నారు. సాయంత్రం ఆరు గంటలకే ప్రధాన కూడళ్లు, రోడ్లు జన సంచారం లేక వెలవెలబోతున్నాయి. ఉదయం 8, 9 గంటల వరకు ఎవరూ బయటికి రావడం లేదు.గ్రీనరీ, జల వనరులు కారణంకొన్నిరోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. పొగ మంచు కురుస్తోంది. కోహీర్‌లో నేల స్వభావం, చెట్లు అధికంగా ఉండటం, చుట్టుపక్కల అడవులు ఉండటం, జల వనరులు ఉండటం వంటివి అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణం. నీటి పారుదల ప్రాజెక్టులు, పెద్ద చెరువులు వంటివి ఉన్నచోట చలి తీవ్రత పెరుగుతుంది. – వెంకటరమణ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీజీడీపీఎస్, హైదరాబాద్ -
మరో రెండ్రోజులు చలి తీవ్రత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిశల నుంచి గాలులు బలంగా వీస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత పెరుగుతున్నట్టు వివరించింది. రానున్న రెండ్రోజులు ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని సూచించింది. ఆదివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 6.7 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 31 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సోమ, మంగళవారాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. -
మన్యం గజగజ
సాక్షినెట్‌వర్క్: మన్యం గజగజ వణుకుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుతో రెండు రోజులుగా చలి ఉధృతమైంది. పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఆదివారం రాత్రి అత్యల్పంగా ప్రముఖ పర్యాటక ప్రాంతం లంబసింగిలో ‘0’ డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 1.5 పాడేరు, మినుములూరు ప్రాంతాల్లో 4డిగ్రీలు, డల్లాపల్లి, మోదాపల్లి ప్రాంతాల్లో 3డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ పరిశోధన విభాగం పర్యవేక్షకుడు దిలీప్ తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా బాగా తగ్గిపోయాయి. 2012 జనవరి 14న 2 డిగ్రీలు, 15న 1 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఆరేళ్ల తరువాత అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వివిధ ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపు ఉండడంతో ఆదివాసీలు వణికిపోతున్నారు. రాత్రిళ్లు వర్షంలా మంచు కురుస్తోంది. సాయంత్రం 3 గంటల నుంచే చలి గాలులు వీస్తున్నాయి. ఆరు బయట ప్రాంతాలన్నీ మంచుతో తడిసిముద్దవుతున్నాయి. రాత్రి పూట పచ్చిక బయళ్లు, వాహనాల మీద పడుతున్న మంచు ఉదయానికి ఐస్‌లా మారుతోంది. ఉదయం 10గంటల వరకు సూర్యోదయం కానరావడం లేదు. జనజీవనానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. వృద్ధులు, ఉదయం బారెడు పొద్దెక్కే వరకు కూడలి ప్రాంతాలు నిర్మానుష్యంగా ఉంటున్నాయి. డిసెంబర్ 27 వరకు చలి తక్కువగానే ఉండేది. వాతావరణంలో మార్పులతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయి పొగమంచు ఉధృతమవ్వడంతో చలి అధికమైంది. వృద్ధులు, చిన్నారులు, ఉదయాన్నే పొలానికి పనికి వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. మరి కొద్ది రోజులు చలి తీవ్రత ఇలాగే ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
ఢిల్లీ ‘చిల్’ మార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిని చలిగాలులు వణికిస్తున్నాయి. ఢిల్లీలో గురువారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ శీతాకాలంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఇవాళ ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. చలిగాలికి తోడు మంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఉదయం వేళల్లో శీతల గాలులు, మంచు ఢిల్లీని వణికిస్తున్నా ముందుముందు గరిష్ట ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల సెల్సియస్‌కు పైగా చేరుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంన్నారు. ఇక బుధవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 5.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మరోవైపు ఢిల్లీలో వాయునాణ్యత సూచీ 319 పాయింట్లతో వెరీ పూర్ కేటగిరీలోనే ఉందని అధికారులు పేర్కొన్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో రాజధాని గాలిలో తేమ పెరుగుతోందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. -
గజగజ
జిల్లాలో పడిపోయిన ఉష్ణోగ్రతలు అగళిలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అనంతపురం అగ్రికల్చర్: చలిచంపేస్తోంది. జిల్లా అంతటా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీంతో చలితీవ్రత పెరిగింది. శుక్రవారం అగళి మండలంలో 7.6 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయయ్యాయి. మడకశిర, హిందూపురం, పెనుకొండ, కదిరి, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, అనంతపురం తదితర ప్రాంతాలు ఉష్ణోగ్రతల్లో మార్పులతో గజగజ వణుకుతున్నాయి. మడకశిరలో 8.7 డిగ్రీలు, రొద్దం 9 డిగ్రీలు, తనకల్లు 10 డిగ్రీలు, లేపాక్షి 10 డిగ్రీలు, పుట్లూరు 10.2 డిగ్రీలు, సోమందేపల్లి 10.3 డిగ్రీలు, కుందుర్పి 10.6 డిగ్రీలు, ఉరవకొండ 11.2 డిగ్రీలు, గుంంతకల్లు 11.9 డిగ్రీలు, పెనుకొండ 12.4 డిగ్రీలు, అనంతపురం 12.6 డిగ్రీలు, కదిరి 12.8 డిగ్రీలు మేర కనిష్టం నమోదయ్యాయి. -
12, 13 తేదీల్లో రాష్ట్రంలో వర్షాలు
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి - పెరిగిన చలి.. ఆదిలాబాద్‌లో 7 డిగ్రీల ఉష్ణోగ్రత సాక్షి, హైదరాబాద్: తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ఈనెల 12, 13 తేదీల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. తుపాను ప్రభావం ఎక్కువగా కోస్తాంధ్రపైనే ఉంటుందని వివరించారు. మరోవైపు రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. 2 నుంచి 4 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. దీంతో ఆ ప్రాంతంలో చలి తీవ్రత మరింత పెరిగింది. ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు ఇంతగా పడిపోవడం ఇదే మొదటిసారని వాతావరణ అధికారులు తెలిపారు. ఆ తర్వాత మెదక్‌లో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, హకీంపేట, రామగుండంలలో 13 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని వై.కె.రెడ్డి తెలిపారు. ఆ తర్వాత సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నారు. -
చలికి 17 మంది బలి
రాష్ట్రవ్యాప్తంగా భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు ఉదయం 10 గంటలు దాటినా తగ్గని తీవ్రత మరో 2 రోజుల పాటు కొనసాగనున్న చలి ఆదిలాబాద్‌లో అతి తక్కువగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. ఉత్తర భారతం నుంచి వీస్తున్న శీతల గాలులతో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉదయం 10 గంటలు దాటినా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. చలి తీవ్రతకు రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లోనే ఏకంగా 17 మంది బలయ్యారు. ఇందులో ఒక్క వరంగల్ జిల్లాలోనే ఎనిమిది మంది మరణించడం ఆందోళనకరమైన అంశం. వృద్ధులు, అనాథలు, రోడ్లపైన నిద్రించేవారు ఎక్కువగా చలి బారిన పడి మృతి చెందుతున్నారు. ఇక మరోవైపు సంక్రాంతి సందర్భంగా రైళ్లు, బస్సుల్లో ప్రయాణించేవారు చలి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్, భద్రాచలం, ఏటూరునాగారం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు అల్లాడిపోతున్నారు. దట్టంగా కప్పుకున్న పొగ మంచు కారణంగా ఆయా ప్రాంతాల్లో 10 గంటలు దాటినా సూర్యుడు కనిపించని పరిస్థితి నెలకొంది. చలికాలంలో గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వం రగ్గులు, దుప్ప ట్లను పంపిణీ చేయాల్సి ఉండగా... సరిగా సరఫరా కావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్ జిల్లాలో చెన్నారావుపేట వుండలం లింగగిరి గ్రావూనికి చెందిన నాంపెల్లి చంద్రవ్ము(75), తోపనగడ్డతండాకు చెందిన బూక్యా భోజ్యా(78), మహబూబాబాద్ మండలం వేంనూరుకు చెందిన బానోతు చిన్నలింగ్యా(85), అడ్డాసికుంటతండాకు చెందిన గుగులోతు చాంప్లి(60), ఉత్తర తండాకు చెందిన అంగోతు బాజు(70), మరిపెడ మండలంలోని ఉగ్గంపల్లికి చెందిన ధారమల్ల తిరుపతమ్మ(75), ఆర్లగడ్డ తండాకు చెందిన బానోతు మౌళి(60), లూనావత్ జమ్కి (75) మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున మరణించారు. ఇక నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన స్వాతంత్య్ర సమరయోధురాలు లక్కరాజు లలితాబాయి(86), మెదక్ జిల్లా నంగునూరు మండలం వెల్గటూర్‌లో లక్ష్మి (55) చలిని తట్టుకోలేక మరణించారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ నలుగురు చలి ధాటికి మృతి చెందగా.. చలి మంటల్లో పడి ముగ్గురు చనిపోయారు. ఆదిలాబాద్‌లో అతి తక్కువగా.. రాష్ట్రంలోనే అత్యంత తక్కువగా ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అక్కడ బుధవారం ఎనిమిది డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 9 డిగ్రీలు, రామగుండంలో 10, హన్మకొండ, హైదరాబాద్‌ల్లో 11, నిజామాబాద్‌లో 12, హకీంపేట, నల్లగొండలో 13, మహబూబ్‌నగర్‌లో 14, భద్రాచలంలో 15 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ చలి తీవ్రత మరో రెండు రోజుల పాటు ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయని ఆయన తెలిపారు. సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. గత ఏడెనిమిదేళ్లతో పోలిస్తే ఈ సారి కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయని వాతావరణ శాస్త్రవేత్త సీతారాం తెలిపారు. కాగా.. చలి మరణాలతో ఆయా జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై పలు చర్యలు చేపడుతోంది. పలు చోట్ల కొన్ని స్వచ్ఛంద సంస్థలు దుప్పట్లు, రగ్గులను పంపిణీ చేస్తున్నాయి. -
వణికిస్త్తున్న చలి
పండుగ వేళ మరింత పెరిగిన చలి తీవ్రత పడిపోయిన ఉష్ణోగ్రతలు.. చలిగాలుల ఉధృతి సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ వేళ చలి తీవ్రత మరింత పెరిగింది. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దీనికితోడు చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉదయం పది గంటల వరకూ చలిగాలులు వీస్తున్నాయి. సాయంత్రం నాలుగు గంటలకే ఆరంభమవుతున్నాయి. దీంతో వృద్ధులు, పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని నర్సీపట్నం, పాడేరు, సీతంపేట తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంటోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం పది గంటల వరకూ పొగమంచు కప్పేస్తోంది. బాగా ఎండ వచ్చేవరకూ రహదారులు కూడా కనిపించట్లేదు. విశాఖ జిల్లాలోని లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు, మూడు డిగ్రీలకు పడిపోవడంతో అక్కడి ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలికి తట్టుకోలేక వృద్ధులు చనిపోతున్న ఘటనలు నమోదవుతున్నాయి. ఇక శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండకు వెళ్లిన భక్తులు చలికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బుధవారం అనంతపురంలో 12.5, కర్నూలులో 14.6, తిరుపతిలో 16.4, కళింగపట్నంలో 15.4, నెల్లూరులో 18.8, కాకినాడలో 17.6, విజయవాడలో 16.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్‌లో 11.4 డిగ్రీల సెల్సియస్ రికార్డయింది. తెలంగాణలో 17 మంది బలి చలి తీవ్రతకు తెలంగాణలో గత 24 గంటల్లో ఏకంగా 17 మంది బలయ్యారు. ఇందులో ఒక్క వరంగల్ జిల్లాలోనే ఎనిమిది మంది మరణించారు. వృద్ధులు, అనాథలు, రోడ్లపైన నిద్రించేవారు ఎక్కువగా చలి బారిన పడి మృతి చెందుతున్నారు. ఆదిలాబాద్, భద్రాచలం, ఏటూరునాగారం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు అల్లాడిపోతున్నారు. -
చలి చంపేస్తోంది!
* మారిన వాతావరణం * పడిపోయిన ఉష్ణోగ్రతలు * తేమ, పొగమంచుతో జనం ఉక్కిరిబిక్కిరి కల్హేర్: ఇటీవల ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన జనాన్ని ఇప్పుడు చలి వణికిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారడం, చలిగాలులు తోడవడంతో ఉష్ణోగ్రతలు పడిపోయి ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. దీంతో జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. తుపాను రాక మునుపు గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతూ వచ్చింది. వాతావరణంలో మార్పుల కారణంగా ప్రస్తుతం ఉష్ణోగ్రతలు గణనీయం గా పడిపోయాయి. ఇక రాత్రి వేళల్లోనైతే ఉష్ణోగ్రతలు మరింత తగ్గిపోతున్నాయి. కల్హేర్, మార్డి, బీబీపేట, సిర్గాపూర్, తదితర ప్రాంతాల్లో చలి తీవ్రత, పొగమంచుతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు భయందోళనకు గురవుతున్నారు. పల్లె ప్రజలు చలిని తట్టుకోవడానికి మంటలు వెలిగించి కాచుకుంటున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు మారిన వాతావరణంతో అనేక మంది వివిధ రకాల వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఆస్థమా, బీపీ, షుగర్, గుండె జబ్బులున్న వారు గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్న పిల్లలు, చంటి పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జలుబు, న్యుమోనియా, సైనస్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు తీవ్రమై ప్రమాదకరంగా మారవచ్చు. స్వెట్టర్లు, కాళ్లకు, చేతులకు గ్లౌజులు ధరించాలి. చిన్న పిల్లలకు ఇవి తప్పనిసరి. ఎక్కువ సమయం బయట తిరగాల్సి వస్తే ఉన్ని దుస్తులు ధరించాలి. చలి వాతావరణంలో ఎక్కువగా బయట తిరగకపోవడమే మంచిది.