సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిని చలిగాలులు వణికిస్తున్నాయి. ఢిల్లీలో గురువారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ శీతాకాలంలో సగటు కనిష్ట ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఇవాళ ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత నాలుగు డిగ్రీల సెల్సియస్‌గా నమోదైందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. చలిగాలికి తోడు మంచు కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు.
ఉదయం వేళల్లో శీతల గాలులు, మంచు ఢిల్లీని వణికిస్తున్నా ముందుముందు గరిష్ట ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల సెల్సియస్‌కు పైగా చేరుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంన్నారు. ఇక బుధవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 5.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మరోవైపు ఢిల్లీలో వాయునాణ్యత సూచీ 319 పాయింట్లతో వెరీ పూర్ కేటగిరీలోనే ఉందని అధికారులు పేర్కొన్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతుండటంతో రాజధాని గాలిలో తేమ పెరుగుతోందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment