- జిల్లాలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
- అగళిలో కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
అనంతపురం అగ్రికల్చర్: చలిచంపేస్తోంది. జిల్లా అంతటా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీంతో చలితీవ్రత పెరిగింది. శుక్రవారం అగళి మండలంలో 7.6 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయయ్యాయి. మడకశిర, హిందూపురం, పెనుకొండ, కదిరి, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, అనంతపురం తదితర ప్రాంతాలు ఉష్ణోగ్రతల్లో మార్పులతో గజగజ వణుకుతున్నాయి. మడకశిరలో 8.7 డిగ్రీలు, రొద్దం 9 డిగ్రీలు, తనకల్లు 10 డిగ్రీలు, లేపాక్షి 10 డిగ్రీలు, పుట్లూరు 10.2 డిగ్రీలు, సోమందేపల్లి 10.3 డిగ్రీలు, కుందుర్పి 10.6 డిగ్రీలు, ఉరవకొండ 11.2 డిగ్రీలు, గుంంతకల్లు 11.9 డిగ్రీలు, పెనుకొండ 12.4 డిగ్రీలు, అనంతపురం 12.6 డిగ్రీలు, కదిరి 12.8 డిగ్రీలు మేర కనిష్టం నమోదయ్యాయి.