బాగా జలుబు చేసినప్పుడు చాలామంది చికెన్ సూప్ చేయించుకుని తాగడం లేదా సూప్‌లా వండిన చికెన్‌గ్రేవీతో అన్నం తినడం చేస్తుంటారు. చాలామంది ఇది ఓ సంప్రదాయ చికిత్స అనుకుంటారుగానీ... నిజానికి చికెన్‌సూప్ ఉపశమనానికి బాగానే పనిచేస్తుంది. దీనికి శాస్త్రీయ కారణాలూ ఉన్నాయి. సూప్‌లా వండిన చికెన్‌లో ‘సిస్టిన్/సిస్టయిన్’ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది మాత్రమే గాకుండా... ఇలా వండే సమయంలో ఆ సూప్‌లోకి ఖనిజ లవణాలూ, విటమిన్లతో పాటు మంచి పోషకాలన్నీ ద్రవంలా ఉడికే సూప్‌లోకి స్రవిస్తాయి.
ఇదే సూప్‌లోకి ‘గ్లైసిన్’, ‘ప్రోలైన్’ లాంటి అనేక అమైనో యాసిడ్స్ సముదాయమైన జిలాటిన్ కూడా స్రవిస్తుంది. ఈ అమైనో యాసిడ్‌లూ, ఇతర పోషకాలు కలగలసిన సూప్ మన వ్యాధి నిరోధకశక్తిని మరింతగా పెంచుతుంది. ఈ అంశాలన్నీ జలుబు ఇతరత్రా ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. అంతేకాదు... ఈ చికెన్‌సూప్ దాదాపు ద్రవరూపంలో ఉండటం త్వరగా జీర్ణం కావడంతో పాటు అన్ని పోషకాలను వేగంగా దేహానికి అందిస్తుంది. జీర్ణశక్తినీ, కాలేయం పనితీరును మెరుగుపరిచి, ఎముకలను మరింత పటిష్టం చేయడానికీ చికెన్‌సూప్ దోహదపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment