సాక్షి, హైదరాబాద్: చలి తీవ్రత రాష్ట్రంలో క్రమక్రమంగా పెరుగుతోంది. చాలాచోట్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. చలికాలం మధ్యస్థానికి చేరడంతో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముంది.
రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. గురువారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 12.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. నల్లగొండ, హైదరాబాద్, వరంగల్, మెదక్‌లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment